రాజయ్య ఫ్యామిలీని అరెస్ట్ చేస్తారా?

Update: 2015-11-04 09:06 GMT
తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ రాజయ్య తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లుగా కనిపిస్తోంది. మంగళవారం అర్థరాత్రి తర్వాత ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం (?) లో కోడలు..ముగ్గురు మనమలు దుర్మరణం పాలు కావటం తెలిసిందే. చివరకు మృతదేహాలు కూడా లభించని పరిస్థితి. గ్యాస్ సిలిండర్ లీక్ (?) కారణంగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్న వాదనపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

తాజా ఘటనపై విచారణ చేపట్టాలని అంతకు ముందే.. రాజయ్యను.. అతని కుమారుడు అనిల్ ను అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజయ్య ఇంటి ముందు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాయి. రాజకీయ నేత కావటంతోనే రాజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవటం లేదని.. ఇది సరైన పద్ధతి కాదని వారు మండిపడుతున్నారు. కోడలు.. ముగ్గురు చిన్నారుల్ని చంపిన ఘటనలో రాజయ్య ఫ్యామిలీని కటకటాల వెనక్కు తక్షణమే పంపాలని కోరుతున్నారు. మరోవైపు.. ఆధారాలు లభ్యమయ్యాక అదుపులోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొనటంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నేత కావటంతో పోలీసులు ఇలా మాట్లాడుతున్నారని.. అదే మరొకరి విషయంలో ఇలాంటిదే జరిగితే పోలీసులు ఇలా మాట్లాడతారా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిరసన సెగ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాజయ్య ఫ్యామిలీని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News