సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. సినిమా వాళ్లు ఆరాధ్యులు. నటులూ దర్శకులూ నిర్మాతలు సెలెబ్రిటీలుగా వెలిగిపోతుంటారు. వారిని చూస్తే చాలు - చేయి తాకితే చాలు - ఆటోగ్రాఫ్ తీసుకుంటే చాలని అభిమానులు ఎగబడుతూ ఉంటారు. వారు స్పీచులకు పొంగిపోతూ ఉంటారు. వారి జీవన విధానాన్ని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు! అయితే, ఇదంతా సామాన్యుడి కోణం నుంచి కనిపించే చిత్రసీమ. తెర వేల్పులు అందరూ ఇలవేల్పులు అనుకుంటే కష్టం! తమకు ఉన్న ఇమేజ్ ను ఇంకోరకంగా వాడుకునేవారు కూడా ఉంటారు. అభిమానం పేరుతో అడ్వాంటేజ్ తీసుకునే ముదుర్లు కొంతమంది ఉన్నారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు... సినీమాయతో ఎట్రాక్ట్ చేసి - వలలోకి లాక్కునే ముదుర్లు కొందరు ఉంటారు! అలాంటి ఓ ముదురు కేసు... ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత మహ్మద్ ఫారూఖీ! అమెరికా జాతీయురాలిపై అత్యాచార యత్నం చేసిన కేసులో ఏడేళ్లపాటు జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే, ఈ యత్నాన్ని కూడా సినీ ఫక్కీలోనే చేశాడీ దర్శకుడు!
అమీర్ ఖాన్ నిర్మించిన పీప్లీలైవ్ చిత్రానికి కో డైరెక్టర్ గా పనిచేశాడు ఫారుఖీ. ఆ తరువాత, సొంత చిత్రాల పనుల్లోపడ్డాడు. సరిగ్గా అదే సమయంలో... అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీ నుంచి ఒక అమెరికా యువతి ఇండియాకి వచ్చింది. ఆమె పీహెచ్ డీలో భాగంగా ప్రాజెక్టు నిమిత్తం ఢిల్లీకి దిగింది. ఆ తరువాత - పారూఖీతో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఈయన తీయని కబుర్లు చెప్పాడు. ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఫ్రెండ్లీగా పార్టీ ఇస్తున్నారా అంటూ ఇంటికి ఆహ్వానించాడు. ఒకపక్క పార్టీ జరుగుతుండగా.. ఆమెని ఒక గదిలోకి తీసుకెళ్లి బలాత్కరించాడు. అనంతరం దయచేసి ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూ... నన్ను క్షమించు అంటూ కాళ్లావేళ్లా బతిమాలాడట.
కాస్త శాంతించిన ఆ యువతి ఫారుఖీని క్షమించి తిరిగి అమెరికా వెళ్లిపోయింది. నాలుగు గోడల మధ్య జరిగిన ఈ సంఘటన ఎవ్వరికీ తెలీదని ఫారుఖీ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తరువాత, ఆమె కూడా కొన్నాళ్లు ఫారుఖీతో టచ్‌లో ఉందట! కానీ, ఏమైందో ఏమో... ఉన్నట్టుండి అమెరికాలోని ఇండియా ఎంబసీని సంప్రదించి దర్శకుడు ఫారుఖీపై రేప్ కేసు పెట్టింది. గత ఏడాది మార్చి 28న తనను దర్శకుడు ఫారూఖీ బలాత్కరించాడు అంటూ కేసు నమోదైంది. ఆ కేసు విషయంలో దర్శకుడిని దోషిగా తేల్చుతూ ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.