ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి .. బీజేపీ సంచలన నిర్ణయం !

Update: 2021-03-23 08:30 GMT
దేశంలో అతి త్వరలో ఐదు రాష్ట్రాల్లో  ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాగా వేయాలని అనేక వ్యూహాలతో ప్రత్యర్దులకి అంతుచిక్కని వ్యూహాలని అమలు చేస్తుంది. ఇక ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఒక్కటైనా పశ్చిమ బెంగాల్ లో మార్చి 27 వ తేదీ నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే .. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే పశ్చిమ బెంగాల్ లో పాగా వేసి , మమత సీటు కి ఎసరు పెట్టాలని చూస్తున్న కమల దళం సరికొత్తగా ఎన్నికల ఎత్తుగడ తో ముందుకు కదులుతోంది. అందులో భాగంగానే  పశ్చిమ బెంగాల్ లోని అస్ గ్రామ్ నియోజక వర్గం నుంచి ఓ పనిమనిషిని బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.  ఇతర పార్టీల నేతలే కాదు, సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆ పనిమనిషి ఎవరు అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.  కలిత అనే పనిమనిషిని బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.  దీంతో కలిత నెల రోజులపాటు తన పనికి సెలవు పెట్టి ప్రచారం చేసుకుంటోంది. రోజువారీ పనులు చేసే తన భర్తతో కలిసి కలిత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. అంతటితో ఆమె ఆగడం లేదు , సీఎం మమత బెనర్జీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ఆట ఆడదాం అని ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేస్తున్న సీఎం మమతపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. మోకాలి గాయంతో ఎన్నికల్లో ఆట ఎలా ఆడతారని కలిత ప్రశ్నించింది. పేదరికంలో మగ్గుతున్న తనకు ఆ పేదరికం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, తనను గెలిస్తే  పేదరికం నిర్ములకు తనవంతు కృషి చేస్తానని హామీలు ఇస్తుంది.
Tags:    

Similar News