మలయాళం నుంచి డబ్బింగ్ అయ్యి తెలుగులోకి వచ్చే సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే వాటిలో సురేష్ గోపీ సినిమాలు ఎక్కువ. పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో రకరకాల సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు సురేష్ గోపీ. అయితే తాజాగా ఈ ప్రముఖ మలయాళ నటుడు - రాజ్యసభ సభ్యుడు సురేశ్ గోపి బీజేపీలో చేరారు. అలా అని ఆయన ఇప్పటివరకూ బీజేపీలో చేరలేదు అలా అని మరోపార్టీలోనూ లేరు. కానీ ఏప్రిల్ లో కేంద్రం ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ - అమిత్ షా మద్దతుతో ఆయన పెద్దల సభలో అడుగు పెట్టారు. ఆ సమయంలోనే సురేష్ గోపీకి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా జరిగిన కేరళ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి తమ అభ్యర్థిగా సురేష్ గోపీని ఎన్నికల బరిలో నిలపాలని బీజేపీ పెద్దలు భావించినా, ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సురేశ్ గోపి విముఖత వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఆయనకు రాజ్యసభకు నామినేట్ చేసింది. అయితే 2014 వరకు సురేష్ గోపీ కాంగ్రెస్ మద్దతుదారుడిగా ఉన్నారు. అనంతరం తన వైఖరి మార్చుకున్న సురేష్ గోపీ... అవినీతిని అరికట్టడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విఫలమైందని తనదైన మార్కు విమర్శలు గుప్పించారు. అయితే రాజ్యసభకు నామినేట్ అయిన సమయంలో కూడా బీజేపీలో అధికారికంగా చేరని సురేష్ గోపీ తాజాగా బీజేపీలో చేరారు, తద్వారా ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. 57 ఏళ్ల సురేశ్ గోపి నటుడిగా కొనసాగుతూనే పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/