బాధ్యతగా వ్యవహరించాల్సిన మీడియా.. సంచలనాల పేరుతో ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం అంతకంతకూ పెరుగుతోంది. పలు తెలుగు.. తమిళ.. మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ప్రముఖ హీరోయిన్ (చట్టబద్ధమైన అంశాల కారణంగా పేరును వెల్లడించలేని పరిస్థితి. తొలుత.. పేరును మీడియా బయటకు తెచ్చినా.. నిబంధనల ప్రకారం లైంగిక వేధింపులకు గురైన వారి పేరును వెల్లడించకూడని నేపథ్యంలో పేరును ప్రస్తావించటం లేదు) కిడ్నాప్ కు గురి కావటం.. ఆపై లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై మలయాళ ఛానల్ తీరును అక్కడి వారంతా తిట్టి పోస్తున్నారు.
అధికార సీపీఎం పార్టీకి చెందిన కైరాలీ టీవీ ప్రసారం చేసిన కథనంపై ప్రముఖులు.. ప్రజలు తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరీ.. ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదంతంలో ఇప్పటికే పలువురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. కైరాలీ టీవీ.. బాధితురాలిపై చౌకబారు కథనాన్ని ప్రసారం చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హీరోయిన్ కిడ్నాప్.. లైంగిక దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఆమె కారు డ్రైవర్ తో.. ఆమెకు సంబంధం ఉందంటూ ఓ చెత్త కథనాన్ని ప్రసారం చేసింది. దీనిని పలువురు తప్పు పడుతున్నారు.
జీవితంలో అత్యంత భయానకమైన అనుభవం ఎదురై.. పుట్టెడు బాధలో ఉన్న వేళ.. ఇలా బాధ్యత లేకుండా కథనాలు ప్రసారం చేస్తారా? అంటూ కోలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఊహించని రీతిలో పెల్లుబికిన ప్రజల ఆగ్రహావేశాలకు తలొగ్గిన కైరాలీ టీవీ యాజమాన్యం.. తమ ప్రసారాల తీరుపై లెంపేసుకొని.. క్షమాపణలు చెప్పింది. సంచలనాల కోసం పరుగులు తీయకుండా.. ఆచితూచివ్యవహరిస్తూ.. బాధ్యతగా వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/