ప్రాణాంతక పసుపు ఫంగస్.. లక్షణాలు ఇవే!

Update: 2021-05-26 16:30 GMT
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత పలువురిలో ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు పలు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం పసుపు ఫంగస్ కేసులను మనదేశంలోనే గుర్తించారు. ఎల్లో ఫంగస్ మరింత ప్రాణాంతకం అని వైద్యులు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్ లో ని ఘాజియాబాద్ లో ఓ వ్యక్తిలో పసుపు ఫంగస్ ను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలను, ప్రభావాన్ని  వైద్యులు వివరించారు.

బ్లాక్, వైట్ ఫంగస్ కన్నా పసుపు ఫంగస్ చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కరోనా బాధితుల్లో ప్రధాన అవయవాలపై దాడి చేస్తుందని అంటున్నారు. ముఖ్యమైన అవయవాల పనితీరులో మార్పు వస్తుందని వెల్లడించారు. క్రమంగా రోగి జీవన క్రియ సన్నగిల్లుతుందని వివరించారు. ఇది అంటువ్యాధి కాదు అని వైద్యులు తెలిపారు. అపరిశుభ్రమైన వాతావరణం, మైక్రోటాక్సిన్లు పీల్చడం వల్ల ఈ ఫంగస్ సోకుతుందని అన్నారు. తొలి దశలోనే గుర్తించి చికిత్స పొందాలని సూచించారు.

కరోనా చికిత్సలో కృత్రిమ ఆక్సిజన్ తో కోలుకున్న వ్యక్తులు, అధిక స్టెరాయిడ్లు ఉపయోగించిన వారిపై ఇది ఎక్కువగా దాడి చేస్తుందని వైద్య నిపుణులు అంచనా వేశారు. వాతావరణంలోని తేమ, మైక్రోటాక్సిన్లు పీల్చినపుడు, కలుషితమైన ఆహారం, అపరిశుభ్రత వల్ల పసుపు ఫంగస్ వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇది రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఇది ఎలా వ్యాప్తి చెందుతుందనే అంశాలపై పూర్తి స్థాయి ప్రయోగాలు జరగలేదని నిపుణులు అంటున్నారు.

కొవిడ్ నుంచి కోలుకున్నవారు అధిక స్టెరాయిడ్లు ఉపయోగించడం వల్ల పసుపు ఫంగస్ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. కొందరిలో చర్మంపై ఉన్న గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని అన్నారు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం లేదన్నారు. కామెర్లు, అజీర్ణం, జీర్ణక్రియ సన్నగిల్లడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, దృష్టి లోపం, అలసట వంటి లక్షణాలతో బాధపడతారని వివరించారు. దీనిని వెంటనే గుర్తించడం మంచిదని అంటున్నారు.
Tags:    

Similar News