ఆయనో ఎంపీ... అంతకుమించి విద్యాసంస్థల అధిపతి... స్కూళ్లు, కాలేజిలు పెద్దసంఖ్యలో ఉన్నాయి... సాధారణ స్థాయి నుంచి వ్యాపారం, రాజకీయపరంగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి... ఎంత బిజీగా ఉన్నా విద్యార్థులను ఉత్సాహపరచడంలో మాత్రం ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆయనే టీడీపీకి చెందిన మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి.... రీసెంట్ గా ఆయన ఓ కాలేజి వేడుకల్లో ఆడిపాడి అందరినీ ఉత్సాహపరిచారు. గంగ్నమ్ స్టైల్లో డ్యాన్సు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజిలో ఆదివారం జరిగిన వార్షికోత్సవంలో మల్లారెడ్డి తన డ్యాన్సుతో అదరగొట్టేశారు.. ఎంపీ డ్యాన్సుకు షాకైన విద్యార్థులు తాము కూడా కాళ్లు కదిపి డ్యాన్సులేశారు. విద్యార్థులు విజిళ్లు, చప్పట్ల మధ్య మల్లారెడ్డి అదరగొట్టేశారు. ఈ దృశ్యాన్ని తమ మొబైళ్లలో చిత్రీకరించిన స్టూడెంట్లు వెంటనే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అక్కడా మంచి రెస్పాన్సు వచ్చింది.
కాగా మొన్నటి ఎన్నికల్లో మల్లారెడ్డి టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్ గా కనిపించడంలేదు. అలాంటిది కాలేజి ఫంక్షన్ లో మాత్రం దుమ్ము దులిపేశారు.