కొన్ని కొన్ని పొగడ్తలు సైతం శాపంగా మారతాయి. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసుకొని మాట్లాడాలే కానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే.. తాము విపరీతంగా అభిమానించే అధినేతలకు తమ మాటలు కొత్త తలనొప్పులు తెచ్చి పెడతాయన్న విషయాన్ని కొందరు నేతలు మర్చిపోతుంటారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎంపీ మల్లారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే రీతిలో ఉన్నాయి. చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాబును ఆయన విపరీతంగా పొగిడేశారు.
చంద్రబాబుకు ప్రధానమంత్రి అవుతారంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబు ప్రదాని అయ్యే అవకాశం లేదన్న విషయం రాజకీయాల మీద అవగాహన ఉన్న చిన్న పోరగాడికైనా తెలుసు. కానీ.. అధినేతను ప్రసన్నం చేసుకొని ఆయన మనసును దోచుకోవాలనుకున్న మల్లారెడ్డి అవసరానికి మించి పొగిడేయటం కనిపిస్తుంది.
మోడీ లాంటి ప్రజాదరణ కలిగిన నేత ప్రధానమంత్రి పదవిలో ఉండి.. 2019 ఎన్నికల్లో మరోసారి ప్రధాని కావాలన్న తపనతో ఉన్న వేళ.. మోడీ మీద.. ఆయనిచ్చే వరాల కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తున్న చంద్రబాబును.. మోడీకి ప్రత్యామ్నాయంగా కీర్తించటం బాబుకు దెబ్బన్న విషయం మల్లారెడ్డికి తెలియకపోవటం ఏమిటో..? ఆ మధ్యన ఇదే తరహాలో శ్రుతిమించిన ఉత్సాహంతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడ్ని ఇలానే పొగిడేయటం.. పొగిడిన నేత బాగానే ఉన్నా.. పొగిడించుకున్న పాపానానికి అధినాయకత్వానికి వెంకయ్య వివరణ ఇచ్చేందుకు కిందామీదా పడాల్సి వచ్చింది.
ఇప్పుడు చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితినే తీసుకొచ్చేలా ఉన్నారు మల్లారెడ్డి. తనకు ప్రత్యామ్నాయాన్ని ఏ మాత్రం సహించని మోడీ లాంటి నేత ప్రధానిగా ఉన్న సమయంలో.. చంద్రబాబు ప్రధాని అయ్యే సత్తా ఉందంటూ చేసే పొగడ్తలు లేనిపోని ఇబ్బందులకు దారి తీస్తాయని చెప్పొచ్చు. మరి.. ఆ సోయి ఎంపీ మల్లారెడ్డికి లేకపోవటం ఏమిటన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.