ఏపీతోపాటే మేము.. హోదా కోసం యానాం క్యూ

Update: 2019-06-05 06:34 GMT
కేంద్రంలో బీజేపీ క్లియర్ కట్ మెజార్టీని సాధించింది. దీంతో దేశంలో ఏ ఇతర ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండా కేంద్రంలో గద్దెనెక్కింది. ఇప్పుడు బీజేపీ ఆడిందే ఆట.. పాడిందే పాట.. అందుకే ఆయా రాష్ట్రాల బాధలు మోడీకి అవసరం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ ఎంతో ఆశగా ఢిల్లీ గడప తొక్కినా చూద్దాం చేద్దామంటూ హామీలే తప్ప హోదా మాత్రం వస్తుందో రాని పరిస్థితి...

ఏపీకి దక్కని హోదా కోసం పోరాడుతుంటే ఇప్పుడు ఏపీకి పక్కన తూర్పుగోదావరి జిల్లాలో ఉండే కేంద్రపాలిత ప్రాంతం యానం కూడా ఏపీకి వలే తమకు హోదా కోసం వెంపర్లాడుతోంది. తాజాగా సీఎం జగన్ ను కలిసిన పాండిచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు పలు అంశాలపై జగన్ కు వినతిపత్రం అందించారు. తెలంగాణ ఏర్పాటు - ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనే డిమాండ్ వల్ల పొరుగున ఉన్న యానాంలో దాదాపు 90శాతం పరిశ్రమలు మూతపడ్డాయని.. ఇక్కడి నుంచి ఏపీకి తరలి వెళ్లాయని యానాం మంత్రి తెలిపారు. దీంతో యానాం అభివృద్ధి కుంటుపడిందని వివరించారు. యానాంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని.. ఇక్కడి ప్రజలపై ప్రభావం పడుతోందని వాపోయారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్... తూర్పు గోదావరి జిల్లాతో సరిహద్దులో ఉన్న యానాంకు కూడా ప్రత్యేక హోదా ప్రోత్సాహాకాలు దక్కేలా సాయపడాలని యానాం మంత్రి జగన్ ను కోరారు.

కాగా పాండిచ్చేరి ఆరోగ్యమంత్రిగా కొనసాగుతున్న మల్లాడి కృష్ణారావు నాటి నుంచి వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా మల్లాడిని రావాలని జగన్ కోరాడు. వైఎస్ జగన్ కోసం తాను ఇటీవల యానా చుట్టుపక్కల తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ విజయం కోసం కృషి చేశానని తెలిపారు. 
Tags:    

Similar News