తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్... వీ6 చానెల్ లో బిత్తిరి సత్తికి ముందు పనిచేసిన చురుకైన జర్నలిస్టు.. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో రాజకీయాల్లో పోటీపడ్డాడు. ఓడిపోయాడు. ఆ సమయంలో వీ6ను వదిలేసి ఆ తర్వాత 10 టీవీలో చేరాడు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేశాడు. ఆ తర్వాత 10 టీవీని టీవీ9 సంస్థ యాజమాన్యం చేజిక్కించుకొని మల్లన్నను సాగనంపేసిందని మీడియా వర్గాల్లో టాక్.
అప్పటి నుంచి కేసీఆర్ పై సొంతంగానే మల్లన్న తన యుద్ధాన్ని మొదలుపెట్టాడు. యూట్యూబ్ ద్వారా చేస్తున్నాడు. తాజాగా కేసీఆర్ భూకుంభకోణాలు అంటూ మల్లన్న వరుస వీడియోలతో తెలంగాణ సర్కారును ఇరుకునపెడుతున్నాడు.
మల్లన్న వీడియోలపై సీరియస్ గా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు అతడి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. మల్లన్నపై ఓ పాత కేసును తవ్వి తీసి ఇప్పుడు ఆ కేసులో అతడిని జైలుకు పంపేందుకు ప్లాన్ చేశారని సమాచారం. తాజాగా సోమవారం మల్లన్న ఇంటి చుట్టూ పోలీసులు మోహరించి అతడిని విచారించారు.
దీంతో మల్లన్న అరెస్ట్ ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మల్లన్నను అరెస్ట్ చేయవద్దంటూ ఆయన ఇంటి ఎదుట దళిత సంఘాలు ఆందోళన చేశాయి. కానీ పోలీసులు మాత్రం కేసీఆర్ కు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్న మల్లన్నను ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసేందుకే రెడీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.చూడాలి మరి కేసీఆర్ కు వ్యతిరేకంగా వెళుతున్న మల్లన్న కథ ఏమవుతుందో..?