మల్లన్నసాగర్ రైతుల పోరాటం అంతా ఇంతా కాదు. తమ భూములు లాక్కోవటం కాదు, సరైన ధర ఇవ్వండి రైతులంతా కన్నీరు పెట్టుకున్నారు. ఉద్యమాలు చేశారు. ధర్నాలు, రాస్తారోకోల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా విషయం ఫైరింగ్ వరకు వెళ్లింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం నిండా 5ఏళ్లు గడవకముందే రైతులపై ఫైరింగ్ జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ వేములాఘట్ సహా ముంపు గ్రామాల తరుపున పొరాటం కొనసాగింది.
ఇప్పటికీ పరిహారం పంపిణీపై ఎన్నో కేసులు నడుస్తున్నాయి. అంతకు మించి జనం ఇంకా కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. అయితే , ఈ పరిస్థితుల్లో దుబ్బాక ఉప ఎన్నికలు రావడం తో ఆ ముంపు గ్రామాల ప్రజలు టీఆర్ ఎస్ కి తగిన బుద్ది చెప్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఆ ముంపు ప్రాంతాల్లో టిఆర్ ఎస్ ఆధిక్యం సాధించింది. అయితే 13 వ రౌండ్ నుండి మొదలైన తొగుట మండలం ముంపు గ్రామాల ఓట్ల లెక్కింపులో టిఆర్ ఎస్ కే ఎక్కువ ఓట్లు పడ్డాయని వెల్లడైంది. దీనితో విపక్షాల అంచనాలు తారుమారైయ్యాయి. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పరిధిలో 10 వేల ఓట్లు ఉన్నాయి.