సుడి అంటే చాలు.. కర్ణాటక కాంగ్రెస్ నేత.. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరిస్తున్న మల్లికార్జున ఖర్గేదేనని చెబుతున్నారు. తనకు అప్పగించిన పనిని తూచా తప్పకుండా చేయటమే కాదు.. మోడీ సర్కారు మీద అవసరానికి తగ్గట్లు నిప్పులు చెరిగే ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుత వరాన్ని ఇస్తున్నట్లు చెప్పొచ్చు. అదే సమయంలో వరుసగా చేస్తున్న తప్పులతో తన ఛరిష్మాను కోల్పోతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టైం దగ్గర పడినట్లేనని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య చేస్తున్న తప్పుల పట్ల కాంగ్రెస్ అధినాయకత్వం గుర్రుగా ఉంది.
ఈ నేపథ్యంలో లోక్ సభ కాంగ్రెస్ నేతగా ఖర్గే వ్యవహరిస్తున్న వైఖరి పట్ల సంతృప్తిగా ఉన్న సోనియాగాంధీ ఆయనకు అనుకోని వరాన్ని ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసేన వెంటనే సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించి.. ఆ బాధ్యతను మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించనున్నట్లు చెబుతున్నారు. మూడేళ్లుగా కర్ణాటక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సిద్ధరామయ్యపై వేటుకు కత్తి వేలాడుతుందని.. ఐదురాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే వేటు పడటం ఖాయమంటున్నారు.