పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ అడుగుపెట్టడం అసంభవం అనే పరిస్థితి నుంచి, అక్కడ పాగా వేసేందుకు బీజేపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. క్రితం సారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అక్కడ జస్ట్ ఖాతాను తెరిచింది. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికల నాటికి బీజేపీ అక్కడ మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థిగా మారింది.
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోగా.. అక్కడ బీజేపీ సంచలన స్థాయి ఫలితాలను సాధించింది. ఊహించనటు వంటి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే బీజేపీ అక్కడ ఇంతటితో ఆగేలా లేదు. మోడీ అంటే ఊగిపోతున్న మమతా బెనర్జీని గద్దె దించి, ఆ పార్టీ అక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకునే లక్ష్యాన్ని పెట్టుకుంది.
ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బెంగాల్ లో ఇప్పటి వరకూ సక్సెస్ ఫుల్ గా బండి నడిపించారు. అసలు ఉనికే లేని చోట తమ ఊపు ఏమిటో చూపించారు. ఈ క్రమంలో బెంగాల్ అసెంబ్లీలో పాగా వేయాలన్న తదుపరి లక్ష్యం దిశగా బీజేపీ దూసుకుపోతోంది!
మరో రెండేళ్లలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడే అలర్ట్ అవుతోంది మమతా బెనర్జీ. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తనకు గట్టి ఝలక్ ఇచ్చిన బీజేపీని ఎదుర్కొనేందుకు ఆమె రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి తన పాలన పదేళ్లను పూర్తి చేసుకుంటుంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేత కూడా ఉంటుంది. అందుకే ఆమె ఇప్పుడు వ్యూహాలను మారుస్తోందట.
అందులో భాగంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో మమతా బెనర్జీ ఒప్పందం చేసుకుంటోందని సమాచారం. ఇప్పటి వరకూ పీకే జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగింది. ఇటీవలే ఏపీలో పాగా వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్ సహకారం అందించారు. ఆ పార్టీకి స్ట్రాటజిస్టుగా పని చేశారు. ఈ పరిణామాల్లో మమత కన్ను పీకే మీద పడింది. రాజకీయ వ్యూహాలను సమీక్షించుకోవడానికి ఐ ప్యాక్ తో ఒప్పందం చేసుకుని ఆమె పీకే సహకారం తీసుకోబోతోందని సమాచారం.