లాంగ్వేజ్ పండిట్లుగా బడా పొలిటీషియ‌న్లు

Update: 2016-12-29 18:29 GMT
సినిమాల్లో రాణించాలంటే న‌ట‌న రావాలి.. హీరోలుగా నిలదొక్కుకుని యూత్ ను ఆక‌ట్టుకోవాలంటే కండ‌లు పెంచాలి.. సో.. ఇప్ప‌టి త‌రం న‌టులే కాదు కాస్త సీనియ‌ర్లూ ఇప్ప‌టికే జిమ్ ల‌లో క‌స‌ర‌త్తులు చేసి సిక్సు ప్యాకులు కూడా సాధించేశారు. మ‌రి ఇండ‌స్ర్టీలో నిల‌బ‌డాలంటే ఆమాత్రం క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు క‌దా.. ఉద్యోగం కావాల‌నుకునేవారు.. ఉన్న ఉద్యోగంలో ఉన్న‌తి పొందాల‌నుకునేవారు కూడా స్కిల్సు పెంచుకుంటారు. ఇప్పుడు పొలిటికల్ ఇండస్ర్టీలోనూ ఇలాంటి ట్రెండు మొద‌లైంది. అయితే.. వారంతా సిక్సు ప్యాకులేమీ పెంచ‌డం లేదు కానీ.. త‌మ స్కిల్సు పెంచుకుంటున్నారు. హైద‌రాబాద్ బ్ర‌ద‌ర్సు ఒవైసీలు ఇప్ప‌టికే తెలుగు నేర్చుకోవ‌డం మొద‌లుపెట్ట‌గా ఇత‌ర రాష్ట్రాల్లోని ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కూడా ఇప్పుడు కొత్త భాష‌లు నేర్చుకుంటున్నార‌ట‌. వారెవ‌రో కాదు... బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ - ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

వీరిద్ద‌రి ల‌క్ష్యం ఒక్కటే... వీరిద్ద‌రికీ శ‌త్రువు ఒక్క‌రే.. అంతేకాదు..త‌మ ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి ఆ శ‌త్రువునే ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు ఇద్ద‌రూ. అందుకే ఇద్ద‌రు ముఖ్య‌మంత్ర‌లు వాటికి కావాల్సిన స‌ర‌కు, స‌రంజామాపై దృష్టి సారించారు. ప్రాంతీయ పార్టీ స్థాయినుంచి జాతీయ పార్టీ స్థాయికి వెళ్లి ఢిల్లీ పీఠం అధిరోహించాల‌న్న‌దే వారి ఏకైక ల‌క్ష్యం. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా చేసిన మోడీ తిరుగులేని వ్య‌క్తిగా మారి ప్ర‌ధాని కాగా లేనిది తామెందుకు కాలేమ‌ని ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ఆలోచించారు. అందుకే ఆయ‌న‌లా హిందీలో జ‌నాన్ని ఆక‌ట్టుకునే ప్ర‌సంగాలు చేయ‌డానికి... ఇత‌ర రాష్ర్టాల్లో ప్ర‌చారానికి వెళ్తే అక్క‌డి భాష‌లు మాట్లాడేలా అవి కూడా నేర్చుకుంటున్నార‌ట‌.

ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్.. అక్క‌డే ప్ర‌ధాని పీఠం అందుకోవాల‌ని మ‌న‌సులో కోరుకుంటున్నారు.  ఈ క్ర‌మంలో తన పార్టీని ఉత్త‌రాది అంతా విస్త‌రించ‌డానికి, అధికారంలోకి తేడానికి ట్ర‌య్ చేస్తున్నారు. అందులో భాగంగా పంజాబ్ కు అడుగు వేయాల‌ని ఆయ‌న ఆశిస్తున్నారు. దీనికి కావాల్సింది రాజ‌కీయ వ్యూహం కంటే ఆ రాష్ర్ట భాషని  అభ్య‌సించ‌డం ముఖ్యం అని తెలుసుకున్నారు. దాంతో పాటు అక్క‌డి సిక్కులు అనుస‌రించే ప‌ద్ద‌తుల్ని కూడా అధ్య‌యనం చేస్తున్నారు. ఇంకేముంది పంజాబీలో మాట్లాడ‌డం నేర్చుకుంటున్నారు.

ఇక మ‌మ‌తా బెనర్జీ ఢిల్లీపై పాదం మోపాలంటే ముందు భాష ముఖ్యమని న‌మ్మారు. దీనికోసం హిందీని నేర్చుకుంటున్నారు. 2018 నాటికి హిందీలో ప్ర‌సంగాలు చేసే స్థాయికి వెళ్లాల‌న్న‌ది ఆమె ల‌క్ష్యంగా ఉంది. 2017 లో యు.పి. ఎన్నిక‌ల్లో తొలిసారిగా హిందీలో ప్ర‌సంగాలు చేసి, ప్ర‌జ‌ల‌లో త‌న ప్ర‌చార స‌త్తాని ప‌రీక్షించుకునేందుకు స‌మాయాత్తం అవుతున్నారు. మ‌రి ఢిల్లీ పీఠంపై క‌న్నేసిన మిగ‌తా సీఎంలు, పార్టీ నేత‌లూ అదే బాట ప‌డ‌తారేమో చూడాలి. అయితే... నార్త్ స్టేట్సు నేత‌ల‌కు ఆ అవ‌స‌రం లేక‌పోయినా ద‌క్షిణాది రాష్ర్టాల వారికి మాత్రం హిందీ అత్య‌వ‌స‌ర‌మే. పెద్ద నేత‌ల‌కే కాదు, మ‌న ఎంపీల‌కూ అది అవ‌స‌రం. ముఖ్యంగా తెలుగు ఎంపీలు పార్ల‌మెంటులో హిందీ, ఇంగ్లీష్ మాట్లాడ‌లేక రాష్ర్ట స‌మస్య‌ల‌ను స‌మ‌ర్థంగా ప్ర‌స్తావించ‌లేక‌పోతున్న సంగ‌తి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News