బెంగాల్‌ లో అది ఎలా అమలు చేస్తారో చూస్తా?

Update: 2019-12-18 12:39 GMT
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం - ఎన్‌ ఆర్‌ సీ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా మాట్లాడుతూ... దేశాన్ని విద్వేషాలతో తగులబెడుతున్నారని మోదీ సర్కార్‌ పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం - ఎన్‌ ఆర్‌ సీ లను బెంగాల్‌ లో అమలు చేయబోమని  తేల్చిచెప్పారు. బీజేపీ ఇప్పుడు బర్త్‌ సర్టిఫికెట్లను ఎందుకు అడుగుతోందని ప్రశ్నించారు.

అలాగే  "ఎవరూ పౌరసత్వాన్ని కోల్పోరని మీరు అంటున్నారు. కాని ఇప్పుడు మీరు పాన్ లేదు - ఆధార్ లేదు - ఏమీ పనిచేయదు అంటున్నారు..మరి ఏం పని చేస్తుంది? బీజేపీ నుంచి ఒక తాయత్తా’  అని ప్రశ్నించారు. ఒంటెద్దు పోకడలతో బీజేపీ వాషింగ్ మెషీన్‌ గా మారింది" అని ఆమె ఘాటుగా విమర్శించారు. అలాగే  అక్రమ వలసదారుల కోసం ఎన్ని శిబిరాలను నిర్మిస్తారని ఆమె హోంమంత్రి అమిత్‌ షాను ప్రశ్నించారు.

అమిత్‌ షా కేవలం బీజేపీ నేత మాత్రమే కాదని దేశానికి హోంమంత్రి అని దేశంలో శాంతి భద్రతలను సవ్యంగా నిర్వహించండని హితవు పలికారు. మీరు అందరి అభివృద్ధికీ పనిచేయడం లేదని అందరి నాశనానికి పనిచేస్తున్నారని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం - ఎన్‌ ఆర్‌ సీ ఉపసంహరించాలని - లేనిపక్షంలో వాటిని బెంగాల్‌ లో ఎలా అమలు చేస్తారో తాను చూస్తానని ప్రధాని మోడీ - అమిత్ షా ని హెచ్చరించారు.
Tags:    

Similar News