మరోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-తృణమూల్ కాంగ్రెస్ ల మధ్య వైరం మొదలైంది. 15 వేల కోట్ల రోజ్ వాలీ గ్రూప్ చిట్ ఫండ్ స్కామ్ లో తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయను మంగళవారం సీబీఐ అరెస్ట్ చేసింది. సుదీప్ ను విచారణకు పిలిచిన సీబీఐ కొన్ని గంటల తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. రోజ్ వాలీ చిట్ ఫండ్ స్కామ్ లో అరెస్ట్ అయిన రెండో తృణమూల్ ఎంపీ సుదీప్. డిసెంబర్ 30న తపస్ పాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తన పార్టీ ఎంపీల అరెస్టులపై తృణమూల్ అధినేత్రి - పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఘాటుగా స్పందించారు. "ప్రధానమంత్రి మోడీకి చాలెంజ్ చేసి చెబుతున్నా అరెస్ట్ లకు బెదిరేది లేదు" అని దీదీ స్పష్టంచేశారు. అరెస్టులు చేసినంత మాత్రాన నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తమ ఆందోళనలను విరమిస్తామనుకుంటే పొరపాటే అవుతుందని మమతా అన్నారు. అసలు మోడీ భారత రాజకీయాలను అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. నిజంగా న్యాయానికి మద్దతు ఇచ్చేవారయితే...అమిత్ షా - మోడీలను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కోల్ కతాలోని ఆర్బీఐ ముందు ఈ నెల 9న.. 10 - 11 తేదీల్లో ఢిల్లీలోని ఆర్బీఐ ముందు ఆందోళనలు చేపడతామని మమతా వెల్లడించారు. తాము న్యాయపోరాటం కొనసాగిస్తామని - కోర్టులోనే ఇది తేల్చుకుంటామని చెప్పారు. "మోడీ ఏమీ చేయలేరు. ఆయన ప్రజల గొంతు నొక్కలేరు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి రావాలి. ప్రజలే వారికి బుద్ధి చెప్పాలి" అని మమతా పిలుపునిచ్చారు. నోట్ల రద్దుపై చాలా పార్టీలు ఆందోళనగా ఉన్నా.. బయటకు చెప్పడం లేదని, ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని ఆమె ఆరోపించారు.
ఇదిలాఉండగా.... తృణమూల్ ఎంపీ బందోపాద్యాయను అరెస్టు చేయడంతో ఆ పార్టీ విద్యార్థి విభాగం కార్యకర్తలు రెచ్చిపోయారు. బీజేపీ కార్యాలయంపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఆఫీసులోకి చొచ్చుకెళ్లి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. సుదీప్ బందోపాద్యాయను సీబీఐ అరెస్టు చేసిన పరిణామంపై తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించిన కొద్దిసేపటికి టీఎంసీ కార్యకర్తలు ఈ పనికి పాల్పడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/