పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనలోని దేశభక్తిని చాటిచెప్పారు. నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలో నిలుచొని బీజేపీతో సై అంటే సై అంటున్న ఆమె ప్రస్తుతం తన కాలు ప్యాక్చర్ కావడంతో వీల్ చైర్ లో కూర్చునే ప్రచారం చేస్తున్నారు.
రెండో విడత ఎన్నికల ప్రచారంలో చివరి రోజు నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.మమత నిర్వహించిన ఎన్నికల సభలో చివరగా జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మమత తన సిబ్బంది సాయంతో వీల్ చైర్ నుంచి లేచి నిలబడ్డారు. ఆమెను పక్కనున్న సహాయకులు లేపారు.
జాతీయ గీతం ఆలపించిన తర్వాత తిరిగి వీల్ చైర్ లో కూర్చున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మమత దేశభక్తికి ఇది మచ్చు తునక అని.. బీజేపీ నేతలు చూసి నేర్చుకోవాలని నెటిజన్లు కొందరు కౌంటర్ ఇస్తున్నారు. మాటల్లో కాదు చేతల్లో చూపించారని మమతను కొనియాడుతున్నారు.
చివరి విడత ప్రచారంలోనే మమత బీజేపీపై నిప్పులు చెరిగారు. రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని ముగించే సమయంలో మమత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కలిగిన గాయాల కన్న.. బీజేపీకి లొంగితే అది ప్రజల బాధగా మారుతుందని అన్నారు.