గంగూలీపై నిప్పులు చెరిగిన మమతా.. కారణమిదే

Update: 2020-03-17 00:30 GMT
కరోనా ఎఫెక్ట్ తో బీసీసీఐ అలెర్ట్ అయ్యింది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ను, ఐపీఎల్ ను కూడా వాయిదా వేసింది. జన సమూహాలతో ఎక్కువగా వ్యాపించే కరోనాను కంట్రోల్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు , సీనియర్ క్రికెటర్ సౌరబ్ గంగూలీ ప్రకటించారు. దేశవాళీ టోర్నీలు కూడా రద్దు చేశారు.

అయితే తాజాగా దక్షిణాఫ్రికాతో కోల్ కతాలోని ఈడెన్ గార్జెన్స్ లో ఈనెల 18న జరగాల్సిన వన్డేను బీసీసీఐ రద్దు చేయడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా మ్యాచ్ రద్దు చేయడం ఏంటని బెంగాల్ సీఎం మమతా తప్పుపట్టారు.

బీసీసీఐ అధ్యక్షుడు.. బెంగాల్ కే చెందిన సౌరబ్ గంగూలీతో విభేదాలు లేవని.. కానీ మ్యాచ్ రద్దుపై కనీసం తమకు సమాచారం ఇవ్వాల్సింది ఉందని.. ప్రభుత్వం నిర్వహిస్తోంది కదా తమకు సమాచారం ఇవ్వరా.. గంగూలీ ఇదేనా మాకు ఇచ్చే గౌరవం అంటూ మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు.

బెంగాల్ కే చెందిన సౌరబ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయినప్పుడు మొదట హర్షం వ్యక్తం చేసింది మమతా బెనర్జీనే. ఇప్పుడు తనను సంప్రదించకపోవడంపై ఇదే గంగూలీపై మమత అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
Tags:    

Similar News