అది బీజేపీ రంగు.. పీపీఈ కిట్లు వెనక్కి పంపిన మమత

Update: 2020-04-10 04:45 GMT
కరోనా ముందు వరకు ప్రధాని నరేంద్రమోడీ మీద ఒంటికాలిపై లేచిన తెలంగాణ సీఎం కేసీఆర్.. కరోనా టైంలో పాత పగలు అన్ని మాని మోడీని పొగుడుతూ కేంద్రం సూచనలు పాటిస్తూ కరోనాపై ఫైట్ చేస్తున్నారు. మోడీ దీపాలు పెట్టుమన్నా.. చప్పట్లు కొట్టమన్నా తన సహజశైలికి భిన్నంగా ఫాలో అయిపోతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం సాయం తప్పనిసరి కనుక కేసీఆర్ అలా చేస్తున్నారన్న వాదన ఉంది. కానీ ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తన తీరు మార్చుకోకపోవడం విమర్శలకు దారితీసింది.

ఓవైపు కరోనాతో ప్రాణాలు పోతున్నాయి. వేలాది మందికి వైరస్ సోకి ఆస్పత్రుల పాలవుతున్నారు. వారికి వైద్యం చేసే వైద్యులు సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం పీపీఈ కిట్స్ పంపిణీ చేస్తోంది. అయితే అవి పసుపు, ఆరెంజ్ మిక్స్ రంగుల్లో ఉన్నాయి. ఈ కిట్స్  బీజేపీ కాషాయ రంగులో ఉన్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తాజాగా ఆగ్రహించారు. కేంద్రం పంపించిన లక్షన్నర పీపీఈ కిట్స్  ను సీఎం మమత వెనక్కి పంపించడం సంచలనమైంది. తెలుపు, లేదా లైట్ బ్లూకలర్ లో ఉండాలని.. అవే పంపాలని కేంద్రానికి తిరిగి పంపించారు. ఇది వివాదాస్పదమైంది.

ప్రపంచంలోని అన్ని దేశాల్లో వైద్యులు కరోనా నుంచి రక్షణకు వేసుకునే పీపీఈ కిట్స్  ఆరెంజ్ పసుపు మిక్స్ కలర్ లో ఉంటాయి. వీటినే ధరిస్తారు. కానీ మమత మాత్రం ఇందులోనూ రాజకీయం వెతికి బీజేపీ రంగు అని వెనక్కి పంపడం దుమారం రేపింది. ప్రాణాలు పోతుంటే.. కరోనాతో ఫైట్ చేస్తున్న వైద్యులకు పంపిణీ చేయాల్సింది పోయి వెనక్కి పంపడం ఏంటని వైద్యులు , ప్రజలు మమతపై మండిపడుతున్నారు.

అయితే సీఎం మమత మాత్రం 5 లక్షల పీపీఈ కిట్స్ ఆర్డర్ ఇచ్చామని.. త్వరలోనే వాటిని పంపిణీ చేస్తామని తెలిపింది.
Tags:    

Similar News