కొన్ని విషయాలకు ఇట్టే హర్ట్ కావటమే కాదు.. తర్వాతి రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవటంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. కష్టంలో ఉండి సాయం అడగాలే కానీ.. నో చెప్పేందుకు ఇష్టపడని ఆయన.. తన మాదిరే మిగిలిన వారు ఉండాలని భావిస్తుంటారు. అలాంటి ఆయనకు ఎదురైన అనుభవం ఇబ్బంది కరంగానే కాదు.. కేసీఆర్ ను హర్ట్ చేసేలా చేసింది. గతంలో ఎప్పుడూ లేనంత భారీగా తెలంగాణ లో ధాన్యం.. మొక్కజొన్నలు పండటం తెలిసిందే. ఏ మాత్రం ఊహించటానికి వీలు లేని రీతిలో కరోనా వచ్చి పడటంతో.. ఇంత పంటను నిల్వ చేయటానికి అవసరమైన జనపనార గోనెసంచుల అవసరమైంది. దీని ఉత్పత్తి పశ్చిమబెంగాల్ లో చేస్తారన్న విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్.. ఓవైపు కేంద్రంతోనూ.. మరో వైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ నేరుగా మాట్లాడారు.
తమకు సాయం చేయాలని.. గోనె సంచుల ఉత్పత్తికి వీలుగా జనపనార ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని కోరారు. అయితే.. కేసీఆర్ ఆశల్ని నీరుకారుస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి దీదీ నో చెప్పేశారు. కేసీఆర్ కోరినట్లుగా గోనె సంచుల కర్మాగారాన్ని ఓపెన్ చేయించటం సాధ్యం కాదని దీదీ తేల్చి చెప్పటం గమనార్హం. దేశంలో మరెక్కడా లేని రీతిలో పశ్చిమబెంగాల్ లో అరవై జనపనార మిల్లులు ఉన్నాయి. దేశానికి అవసరమైన గోనె సంచుల్లో 80 శాతం బెంగాల్ నుంచే ఉత్పత్తి అవుతుంటాయి. ఈ మిల్లుల్లో పని చేయటం ద్వారా రెండు లక్షల మంది ఉపాధి పొందుతారని చెబుతున్నారు.
భారీగా పండిన పంటను నిల్వ చేయటంతో పాటు..కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పండిన పంటను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించటం తెలిసిందే. అయితే.. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి ధాన్యాన్ని నిల్వ చేయటానికి సంచుల అవసరం చాలా అవసరం. అయితే.. తగినన్ని లేని దుస్థితి. ఈ క్రమంలోనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రత్యేకంగా రిక్వెస్టు చేశారు సీఎం కేసీఆర్. అయితే.. ఆయన వినతికి నిర్మోహమాటంగా నో చెప్పేశారు దీదీ. దీంతో.. సీఎం కేసీఆర్ హర్ట్ అయినట్లు చెబుతున్నారు. అవసరమై సాయాన్ని కోరితే.. మరీ ఇంత కరకుగా వ్యవహరిస్తారా? అన్న మాట ఆయన నోటి నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది.
తాజాగా చోటు చేసుకున్న పరిస్థితుల్లో కొత్త ఆలోచనలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా.. రేషన్ డీలర్ల దగ్గర ఉన్న పాత గోనెసంచుల్ని కొనుగోలు చేయాలని.. ఒక్క సంచి కూడా బయటకు వెళ్లకూడదని డిసైడ్ చేసింది. ఏది ఏమైనా.. గోనె సంచుల కొరత అన్నది తెలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ సంచుల్ని సైతం సేకరించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే.. అది చివరి ఆప్షన్ మాత్రమేనని చెబుతున్నారు. ఏమైనా.. దీదీ నో చెప్పటం కేసీఆర్ ఇగోను హర్ట్ చేయటమే కాదు.. రానున్న రోజుల్లో గోనె సంచుల ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరగటం ఖాయమని చెబుతున్నారు. ప్రతి సంక్షోభం ఒక పాఠాన్ని నేర్పుతుందని చెబుతారు. ఆ విషయం కేసీఆర్ కు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుందన్న మాట వినిపిస్తోంది.