విపత్తు వేళ కూడా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెట్టు చేయడం విశేషం. యాస్ తుఫాన్ ధాటికి అతలాకుతలం అయిన రాష్ట్రాలతో ప్రధాని మోడీ తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తాను హాజరు కానని.. సీఎస్ హాజరవుతారని సీఎం మమతా బెనర్జీ బెట్టు చేసినట్టు తెలిసింది.
బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఎన్నికలు అయిపోయినా కూడా మోడీపై కోపాన్ని, పంతాన్ని వీడడం లేదు. తాజాగా మోడీ సమీక్షకు హాజరు కానని బెట్టు చేశారు. కాసేపటికే మనసు మార్చుకొని చివరకు ప్రధాని మోడీ నిర్వహించిన సమీక్ష సమావేశానికి సీఎం మమత హాజరయ్యారు.
అయితే మోడీ మీటింగ్ కు మమత 30 నిమిషాలు ఆలస్యంగా హాజరయ్యారు. ప్రధాని మోడీ, గవర్నర్ ధన్కర్ ఏకంగా మమత కోసం 30 నిమిషాల పాటు వేచిచూడడం గమనార్హం. ఆ తర్వాత సమీక్షా సమావేశాన్ని ప్రారంభించారు.
హఠాత్తుగా 30 నిమిషాల తర్వాత మమత సమావేశానికి హాజరు కావడం అందులోని అధికారులు, నేతలకు షాకింగ్ గా మారింది. అయితే మమత ఎక్కువ సేపు సమావేశంలో ఉండలేదు. తుపానుకు సంబంధించిన కొన్ని పత్రాలను మోడీకి సమర్పించి అక్కడి నుంచి సీఎం మమత నిష్క్రమించారు. మోడీ మీటింగ్ నే మమత అవమానించారని బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.