మమత షాకింగి రియాక్షన్... బహుశా మోడీ అలాంటోడు కాదేమో !

Update: 2022-09-20 06:31 GMT
వినటానికే చాలామందికి విచిత్రంగా ఉంటుంది. కానీ వాస్తవంగా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ సమావేశాల్లో  సోమవారం జరిగిందిదే. ఇంతకీ విషయం ఏమిటంటే నాన్ బీజేపీ పార్టీల్లోని నేతలపై సీబీఐ, ఈడీ, ఐటి శాఖల ఉన్నతాదికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. టార్గెట్ చేస్తున్నారో లేదా కాకతాళీయమో తెలీదుకానీ దర్యాప్తు సంస్ధలు చేస్తున్న దాడుల్లో నాన్ బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలే ఎక్కువమంది అరెస్టవుతున్నారు.

అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం లాంటి ఆరోపణలపై సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులు పదే పదే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. వీరిలో కొంతమందిని అరెస్టు కూడా చేస్తున్నారు. దాంతో ప్రతిపక్షాలంతా గోలగోల చేసేస్తున్నాయి. ప్రతిపక్షాలను నరేంద్ర మోడీ టార్గెట్ చేసి మరీ కేసుల్లో ఇరికిస్తున్నారంటో రచ్చ చేస్తున్నాయి. మహారాష్ట్ర, బీహార్, తెలంగాణా, ఢిల్లీ, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆప్, ఎన్సీపీ, జేడీయూ నేతలపై చాలా కేసులు పెట్టారు.

కేసులు నమోదై అరెస్టయిన వారిలో మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలున్నారు. దాంతో బీజేపీ దర్యాప్తు సంస్ధలను అడ్డంపెట్టుకుని కక్ష సాధింపులకు దిగుతోందనే గోల పెరిగిపోతోంది. చాలా పార్టీల అధినేతలు బాహాటంగానే నరేంద్రమోడీనే కారణమని చెబుతున్నారు.

ఇలాంటి నేపధ్యంలోనే బెంగాల్ అసెంబ్లీ సీబీఐ, ఈడీ దాడుల విషయమై మమత మాట్లాడుతు జరుగుతున్న దాడులకు మోడీకి సంబంధం లేదన్నారు. దర్యాప్తుసంస్ధలు చేస్తున్న దాడులు, నమోదు చేస్తున్న కేసులన్నీ మోడీకి తెలిసే జరుగుతున్నాయని తాను అనుకోవటం లేదన్నారు.

అయితే జరుగుతున్న వాటికి ప్రధాన కారణం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నట్లుగా మమత ఆరోపణలు చేశారు. ప్రధాని కార్యాలయం ఆజమాయిషీలో పనిచేయాల్సిన సీబీఐ హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్లు మండిపడ్డారు.

విచిత్రం ఏమిటంటే ప్రతిపక్షాల నేతలు ఎదుర్కొంటున్న ఆరోపణల్లాంటివే బీజేపీ ప్రభుత్వంలోని మంత్రులు, సీనియర్ నేతలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే సీబీఐ, ఈడీ వాళ్ళ జోలికి వెళ్లడం లేదని మమత గుర్తుచేశారు. కారణాలు ఏవైనా మోడీని టార్గెట్ చేయకుండా మమత మాట్లాడటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News