పశ్చిమ బెంగాల్ లో బీజేపీని చిత్తు చేసిన తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్లాన్ చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్మాయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. మోడీ షాలు ప్రచారం చేసినా బెంగాల్ లో బీజేపీని ఓడించిన మమతా ఇప్పుడు ఆపార్టీకి పట్టున్న మరో రాష్ట్రం గోవాపై ఫోకస్ చేసింది.
పశ్చిమ బెంగాల్ తరహాలోనే గోవాలోనూ ఖేలా హోబే ప్రచారాన్ని ప్రారంభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని మట్టికరిపించేందుకు బెంగల్ తో గోవాకు ఉన్న సారూప్యతల్ని తెరపైకి తెస్తోంది. నందిగ్రామ్ లో ఓటమి పాలైన మమతా బెనర్జీ.. తాజాగా తన పాత నియోజకవర్గం భవానీపూర్ లో గెలుపు కోసం ఉప ఎన్నికల బరిలోకి దిగారు. భవానీపూర్ లో మమత గెలుపు ఈజీనే.. దీంతో మమత ఓవైపు భవానీపూర్ పై దృష్టిపెడుతూనే మరోవైపు మహారాష్ట్ర పక్కనే ఉన్న గోవాపైన దృష్టిసారిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గోవాలో సత్తా చాటుకోవాలని ఆమె పట్టుదలగా ఉంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇందులో బీజేపీ మరోసారి విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో సీనియర్ నేత మనోహరి పరికార్ లేని లోటు ఆ పార్టీని వేధిస్తోంది. గోవాలో విజయం కోసం బాజేపీ స్టార్ క్యాంపెయినర్లను వెతుక్కుంటోంది. దీంతో ఇప్పుడు గోవాలో బీజేపీని టార్గెట్ చేసేందుకు ఇదే సరైన సమయంగా తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది.
ఇప్పటికే టీఎంసీలోని జాతీయ రాజకీయాలను చూసే ఇద్దరు కీలక నేతలను మమత గోవాకు పంపారు. ఎంపీ డెరాక్ ఓబ్రెయిన్, ప్రసూన్ బెనర్జీలను రంగంలోకి దింపారు. గోవాలో తృణమూల్ అభ్యర్థులను బరిలోకి దింపితే వారి గెలుపు అవకాశాలను వీరిద్దరూ సేకరిస్తున్నారు. బెంగాల్ లో టీఎంసీ గెలవడానికి ‘ఖేలా హోబే’ ప్రచారం ముఖ్యమైంది. ‘ఆట మొదలైంది’ అని బెంగాలీలో దీని అర్థం. బీజేపీని బెంగాల్లో ఎదుర్కొనేందుకు టీఎంసీ ప్రారంభించిన ఈ ప్రచారం విజయవంతమైంది. ఇప్పుడు ఇదే నినాదాన్ని గోవాలోనూ ప్రయోగించేందుకు తృణమూల్ ప్రయత్నాలు చేస్తోంది. బెంగాల్ లో ఉపయోగించిన అస్త్రాలను గోవాలోనూ అమలు చేయాలని మమత భావిస్తున్నారు. మరి ఇది వర్కవుట్ అవుతుందా? గోవాలో తృణమూల్ అడుగు పెడుతుందా? అన్నది వేచిచూడాలి.