బీజేపీ ఒకటంటే.. టీఎంసీ రెండు అంటుంది. ప్రధాని మోడీ సై అంటే.. ఏకంగా బెంగాల్ సీఎం తొడగొడుతోంది. బీజేపీ అంటే అస్సలు పడని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న టీకాల సర్టిఫికెట్లలో ప్రధాని మోడీ ఫొటోలను తీసివేయించింది. తన ఫొటోలను అక్కడే వేసుకొని టీకా సర్టిఫికెట్లు ఇస్తోంది. ఇప్పటివరకు మోడీ ఫొటోలు ఉండగా.. వాటిని తొలగించి పాలక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఫొటోలను పెట్టారు.
మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద ప్రభుత్వ ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లలో వ్యాక్సిన్ ఇస్తున్న వారికి ఈ కొత్త సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. అయితే 18-44 ఏళ్ల మధ్య వయసున్న వారికే వీటిని ప్రధానం చేస్తున్నారు. చత్తీస్ ఘడ్ తర్వాత ఇలాంటి చర్య తీసుకుంది బెంగాల్ కావడం విశేషం.
చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్టిఫికెట్లపై మోడీ ఫొటోలు తొలగించి వాటి స్థానంలో సీఎం భూపేష్ బాఘేల్ ముఖచిత్రాన్ని ప్రచురిస్తోంది.
ఇప్పటికే దీనిపై గత బెంగాల్ ఎన్నికల సమయంలోనే టీఎంసీ అభ్యంతరం చెప్పింది. టీకాల సర్టిఫికెట్లపై మోడీ ఫొటోలు ఉంటే రాజకీయంగా బీజేపీకి లబ్ధి చేకూరుతుందని.. తీసేయాలని టీఎంసీ అధినేత్రి మమత నాడు ఈసీకి లేఖ రాసింది. కానీ నాడు ఈసీ దీనిపై స్పందించలేదు. ఇప్పుడు బెంగాల్ లో అధికారంలోకి రావడంతో మమత ఏకంగా మోడీ ఫొటోను తీసివేసి మరీ.. ఇలా తన ఫొటోవేసుకొని బీజేపీకి షాకిచ్చింది.