పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన పెగాసన్ వ్యాఖ్యలు ఇప్పుడు పెనుసంచలనంగా మారటం తెలిసిందే. గత ప్రభుత్వంలో తన వద్దకు పెగాసన్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయాలన్న ఆఫర్ వస్తే.. తాను రిజెక్టు చేసినట్లుగా చెప్పటం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడితో ఆగని మమతా బెనర్జీ మరో అడుగు ముందుకు వేసి.. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెగాసన్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. వేళ్లు అన్ని చంద్రబాబు వైపు మళ్లాయి.
దీంతో.. దీదీ వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుంది? దీదీ సంధించిన పెగాసన్ బాంబ్ బాబు మీద ఏ రేంజ్ లో పేలుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే.. ఈ వివాదం మరింత ముదరక ముందే అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగారు లోకేశ్. తమ ప్రభుత్వంలో పెగాసన్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయలేదని.. దాని డెవలపర్లు తమ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించారని.. కానీ తాము తిరస్కరించినట్లు పేర్కొన్నారు.
చట్ట వ్యతిరేక కార్యక్రమాల్ని ప్రోత్సహించటం.. వాటిని అనుమతించటం తమ పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ చేయరన్నారు. మరి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోటి నుంచి కూడా వచ్చింది కదా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన లోకేశ్.. ‘ఆమె ఏదో తప్పుడు సమాచారంతో అలా మాట్లాడి ఉంటారు. నిజంగానే పెగాసన్ సాఫ్ట్ వేర్ ను తాము కొని విపక్ష నేతల పై నిఘా పెట్టి ఉంటే.. జగన్ అధికారంలోకే వచ్చే వారు కదా?’ అని ప్రశ్నించారు.
అంతే కాదు.. తాము నిజంగానే పెగాసన్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే.. ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వం ఆ విషయాన్ని బయటపెట్టి ఉండేదని.. తమపై చర్యలు తీసుకొని ఉండేదంటూ అందరూ ఆమోదించే లాజిక్ ను తెర మీదకు తీసుకొచ్చారు. మొత్తానికి సరైన సమయంలో సరైన లాజిక్ ను చెప్పటం ద్వారా.. పెగాసన్ ఇష్యూను మెగ్గలోనే తుంచేశారని చెప్పక తప్పదు.