బెంగాల్ వైపు చూశావో.. ఢిల్లీ కబ్జా చేస్తా

Update: 2017-04-28 12:26 GMT
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. తనను జైలులో పెడతామన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా  బెదిరింపులకు లొంగేది లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా స్పష్టం చేశారు. 2019 ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ ను అధికారంలో నుంచి దించివేయడానికి కృషి చేయాలని అమిత్ షా బెంగాల్ బీజేపీ విభాగానికి లక్ష్యం నిర్దేశించారు. ఈ నేపథ్యంలో మమత అంతకుమించిన టార్గెట్ ను అనౌన్స్ చేశారు. ఏకంగా ఢిల్లీలో పాగా వేస్తానని అన్నారు.
    
“తృణమూల్ అంటే మీకు ఎందుకంత భయం. తృణమూల్ మళ్లీ అధికారం హస్తగతం చేసుకుంటుందని తెలిసినందువల్లే మీరు భయపడుతున్నారు. కాని మేం దిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకుంటాం. తృణమూల్ ను బెదిరించడం కుదరదు. వాళ్లు దిల్లీ నుంచి వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు. బెంగాల్ లో అధికారంలోకి రావాలని తొందరపడుతున్నారు. గుజరాత్ లో సవ్యంగా పాలించలేని వారు బెంగాల్ మీద కన్నేశారు” అని మమత అన్నారు. బీజేపీకి పట్టు లేని అయిదు రాష్ట్రాలలో 15 రోజుల పాటు పర్యటించే కార్యక్రమంలో భాగంగా అమిత్ షా బెంగాల్ లో రెండు రోజులు పర్యటించడానికి వచ్చారు. “వారు ఉదయం మురికి వాడల్లో భోజనం చేసి సాయంత్రం అయిదు నక్షత్రాల హోటళ్లలో విందు చేస్తారు. ఇది వారి ద్వంద్వ నీతికి తార్కాణం. నేను రోజూ మురికివాడలకు వెళ్తాను. నేను పేదలను, బతకడానికి పోరాటం చేసే వారిని గౌరవిస్తాను” అని మమత అన్నారు
    
దేశ రాజకీయాల్లో మమత వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం కలిగించాయి. ఇంతకాలం ఆమె ఢిల్లీ పైనా కన్నేశారని చాలామంది అనుకున్నా  కూడా ఇంతకాలం డైరెక్టుగా ఆమె నోటి నుంచి ఎన్నడూ ఆ మాట రాలేదు. ఢిల్లీలోనూ అధికారం కైవసం చేసుకుంటానని ఆమె అనడంతో బీజేపీ వ్యతిరేకత శక్తులన్నీ మమతవైపు ఆశగా చూస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News