ప్రత్యర్థులు వేసే ఎత్తుల్ని చిత్తు చేయటమే కాదు.. తనను చిరాకు పెట్టే ప్రత్యర్థికి చుక్కలు చూపించటం కూడా ముఖ్యమే. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ మధ్యన ఎందుకో మర్చిపోయినట్లున్నారు. అవసరానికి తగ్గట్లుగా వేగవంతమైన నిర్ణయాల్ని తీసుకునే ఆమె.. కేంద్రంలో మోడీ ప్రభ మొదలైన తర్వాత నుంచి ఆమె ఎత్తులు వేసే విషయంలో ఎక్కడో తేడా కొట్టినట్లుగా కనిపిస్తుంది. గతంలో.. ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఎత్తులు వేయటంలో కాంగ్రెస్ కు మించినోళ్లు ఉండరన్నట్లుగా వ్యవహరించేవారు. ఇప్పుడా బాధ్యతను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకోవటం గమనార్హం.
ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న మమత.. తన ప్రత్యర్థి కమ్ రాజకీయ శత్రువు బీజేపీపై తిరుగులేని అధిక్యతను ప్రదర్శించారన్న సంగతి తెలిసిందే. తాజాగా దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ ఎపిసోడ్ కు సంబంధించి దీదీ అదిరే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఓవైపు పెద్ద మనిషిలా వ్యక్తిత్వ వికాస నిపుణుడిలా మాటలు చెబుతూనే.. తాను చేయాల్సిన రాజకీయాల్ని చేసే మోడీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు ఏ మాత్రం ఊహించలేని ఝులక్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న దీదీ.. ప్రధాని మోడీని ఈ రోజు (మంగళవారం) సాయంత్రం నాలుగు గంటల సమయంలో కలవనున్నారు. వీరి భేటీకి ఒక రోజు ముందు ఆమె.. కేంద్రం కిందామీదా పడే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. వాస్తవానికి.. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీసుకొని.. తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చేత చేయించాల్సింది. అయితే.. ఆ అవకాశాన్ని సోనియమ్మకు దీదీ ఇవ్వలేదని చెప్పాలి. పెగాసస్ ఉదంతంపై విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయటం ద్వారా కేంద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఈ కమిషన్ ను రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని తన ఢిల్లీ పర్యటనకు బయలుదేరటానికి కాస్త ముందుగా మమత ప్రకటించటం విశేషం. ఈ కమిషన్ సభ్యులుగా కోల్ కతా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్య.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ భీంరావ్ లోకుర్ లు వ్యవహరించనున్నారు. ఈ కమిషన్ ను ఏర్పాటు చేసిన వైనంపై మాట్లాడిన మమత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఫోన్ల హ్యాకింగ్ లోె ఎవరెవరి పాత్ర ఉంది? ఏ విధంగా వారు నిఘా పెడుతున్నారు? ఇతరులు మౌనం వహించేలా ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు? అన్న విషయాల్ని ఈ కమిషన్ తేలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
పెగాసస్ ఎపిసోడ్ పై దీదీ వేసిన ఎత్తుగడ మాస్టర్ స్ట్రోక్ గా పలువురు అభివర్ణిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. చట్టంలోని అంశాల్ని క్షుణ్ణంగా తెలిసిన వారిచ్చిన సలహాతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తోంది. దీదీ తీసుకున్న ఈ నిర్ణయానికి విరుగుడు ఎత్తుగడ అంత తేలిక కాదని చెబుతున్నారు. దీదీ సర్కారు ఏర్పాటు చేసిన ఈ కమిషన్ కు సంబంధించి చట్టం ఏం చెబుతోందన్న విషయంలోకి వెళితే.. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952 ప్రకారం ఏదైనా అంశంపై కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విచారణ సంఘాన్ని నియమించే వీలుంది.
ఒకవేళ కేంద్రమే మొదట విచారణ కమిషన్ నియమిస్తే.. అది అమల్లో ఉన్నంతకాలం మళ్లీ అదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వేరే విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయటం కుదరదు. ఒకవేళ మరో కమిషన్ నియమించాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే.. ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే విచారణ సంఘాన్ని నియమిస్తే మరిన్ని రాష్ట్రాలకు ఆ విచారణను వర్తింపజేస్తే తప్ప కేంద్రం కూడా మరో ఎంక్వయిరీ కమిషన్ వేయకూడదని చెబుతున్నారు. ‘కొన్నిసార్లు నిద్ర పోతున్న వారిని లేపటానికి మనమే వాళ్లను లేపాల్సి ఉంటుంది. అందుకే మేమే కమిషన్ వేశాం’ అని చెప్పటం ద్వారా దీదీ తన ఎత్తుగడను చెప్పకనే చెప్పేశారు. ఈ ఎత్తుతో కేంద్రమే విచారణ కమిషన్ వేసేలా ఒత్తిడి తీసుకొచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానితో భేటీ కావటానికి ఒక రోజు ముందు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూస్తే.. మోడీకి అసలుసిసలు ప్రత్యర్థి దీదీనే బాస్ అన్న భావన కలుగక మానదు.