బాబు ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మోడీ సర్కారుపై దునుమాడేందుకు వీలుగా ఆయన టూర్ పెట్టుకోవటం తెలిసిందే. మోడీకి ధీటుగా రాజకీయ కూటమిని ఏర్పాటు చేసి.. దానికి కీ రోల్ ప్లే చేయాలని బాబు తపిస్తున్నారు. తనలా మోడీని వ్యతిరేకించే వారిని జట్టు కట్టటం ద్వారా తన బలాన్ని మోడీ బ్యాచ్ కు చూపించటం.. అరె.. ఇంత సమర్థుడైన మిత్రుడ్ని మిస్ అయ్యామన్నట్లుగా చేయాలన్నదే ఏపీ ముఖ్యమంత్రి ప్రయత్నంగా చెబుతున్నారు.
అయితే.. ఇలాంటి ప్రయత్నంలో బాబు బ్యాచ్ కు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తన ఢిల్లీ టూర్ లో ఎంత మంది వీలైతే అంతమంది నేతల్ని కలవాలని.. చిన్నా.. పెద్ద అన్న తేడా లేకుండా పార్టీల అంకె తప్పించి మరింకేమీ ముఖ్యం కాదన్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.
జాతీయ రాజకీయాల్లో తన పేరు మారు మోగేందుకు వీలుగా బాబు వేసిన ఒక ప్లాన్ కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఊహించని షాక్ ఇచ్చారని చెబుతున్నారు. దీదీతో భేటీ అయితే వచ్చే ప్రాధాన్యత ఏమిటన్నది బాబుకు తెలియంది కాదు. అందుకే.. దీదీని ప్రసన్నం చేసుకొని ఆమెను ఢిల్లీకి వచ్చేలా చేయాలని బాబు భావించారు.
ఇందులో భాగంగా అలా అని తానే నేరుగా దీదీతో మాట్లాడేందుకు బాబు ప్రయత్నించారు. రెండుసార్లు ఫోన్ చేసినా.. ఆమె లైన్లోకి రాలేదని చెబుతున్నారు. విభజన సమయంలో దీదీ మద్దతు కోసం ఆమె అపాయింట్ మెంట్ కోసం బాబు ప్రయత్నం చేయటం.. ఆ సందర్భంగా బాబుకు చేదు అనుభవం ఎదురుకావటం తెలిసిందే. తాజా ఎపిసోడ్ లోనూ అలాంటి పరిస్థితే మరోసారి ఎదురైందని చెబుతున్నారు.
తాను ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించినా.. దీదీ అందుబాటులోకి రాని నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లను రంగంలోకి దించినట్లుగా చెబుతున్నారు. కొందరు టీడీపీ ఎంపీలు తృణమూల్ నేతలతో మాట్లాడి.. తమ అధినేత ఢిల్లీ పర్యటన వేళకు దీదీని కూడా రప్పిస్తే బాగుంటుందన్న ఆలోచనను షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు.. సాధ్యం కాదన్న మాటను తృణమూల్ నేతలు స్పష్టం చేశారని చెబుతున్నారు. దీదీతో భేటీతో మైలేజ్ పొందాలనుకున్న బాబుకు తాజా పరిణామం మింగుడుపడని రీతిలో మారిందంటున్నారు. కేసీఆర్ లాంటోడే.. కోల్ కతాకు వెళ్లి దీదీ దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది చంద్రబాబు ప్లాన్లకు తగ్గట్లు మమతా ఓకే అనేస్తారా ఏంది?