మోడీ చెప్పిన కాసేప‌టికే చంపేశారు

Update: 2017-06-30 06:15 GMT
దేశ రాజ‌కీయాల్లో అత్యంత ప్ర‌భావితం చేసే నేత‌గా ప్ర‌ధాని మోడీకి తిరుగులేని స్థానం ఉంది. దేశంలోనే కాదు.. అంత‌ర్జాతీయంగా ఆయ‌న మాట‌కు ఇస్తున్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. స‌మ‌కాలీన భార‌తంలో అత్యంత శ‌క్తివంత‌మైన ప్ర‌ధానిగా మోడీ పేరు సంపాదించారు. ఆయ‌న మాటే వేదంగా భావించే వారు.. అనుస‌రించే వారు కోట్లాది మంది ఉన్నారు. మ‌రి.. అలాంటి వ్య‌క్తి  స్వ‌యంగా త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసిన కొద్ది గంట‌ల‌కే అమానుషంగా చేసిన హ‌త్య ఇప్పుడు హాట్ టాపిక్.

గో సంర‌క్ష‌ణ పేరుతో మ‌నుషుల్ని చంప‌టం ఎంత‌మాత్రం ఆమోదం కాద‌ని ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించ‌టం తెలిసిందే. స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన క్ర‌మంలో ఆయ‌న గో సంర‌క్ష‌ణ పేరుతో ఇటీవ‌ల సాగుతున్న హింస గురించి మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గో ర‌క్ష‌ణ పేరుతో మ‌నుషుల్ని చంప‌టం ఏ మాత్రం స‌రికాద‌న్న మాట‌ల్ని ఆయ‌న చెప్పారు.

ఇదిలా ఉంటే.. తాజాగా జార్ఖండ్‌లో గో సంర‌క్ష‌ణ పేరిట ఒక హ‌త్య జ‌ర‌గ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. బీఫ్ ను అక్ర‌మంగా తీసుకెళుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఒక వ్య‌క్తిపై దాడి చేశారు గుర్తు తెలియ‌ని కొంద‌రు వ్య‌క్తులు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తికి చెందిన వాహ‌నానికి నిప్పు అంటించారు. ఈ ఉదంతంలో తీవ్రంగా గాయ‌ప‌డిన వ్య‌క్తి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

జార్ఖండ్ లోని రామ్ గ‌ఢ్ జిల్లాలోని బ‌జ‌ర్తంద్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌లోకి వెళితే.. అలీముద్దీన్ అనే వ్య‌క్తి కారులో వెళుతుండ‌గా గ్రామ శివారులో కొంద‌రు ఆయ‌న్ను అడ్డుకున్నారు. అలీముద్దీన్‌ ను కారు దింపి దాడి చేశారు. కారులో బీఫ్ ఉంద‌ని ఆరోపిస్తూ దాడి చేశారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గో సంర‌క్ష‌ణ పేరుతో మ‌నుషుల ప్రాణాలు తీయ‌టం ఏ మాత్రం స‌రికాద‌ని మోడీ నోటి నుంచి మాట‌లు వ‌చ్చిన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలో ఒక వ్య‌క్తి దాడికి గురై.. ప్రాణాలు విడ‌వ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News