కేసీఆర్‌ ను విమ‌ర్శిస్తే జైలుకే

Update: 2017-02-20 15:20 GMT
టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విమ‌ర్శ‌కులు ఇక త‌మ ప‌నికి స్వ‌స్తిచెప్పాల్సిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో కేసీఆర్‌ పై అసభ్యంగా పోస్టింగ్‌లు పెట్టారో.. అంతే సంగతులు. అవును మ‌రి! సోషల్‌ మీడియాలో సీఎం కేసీఆర్ మీద, ప్రభుత్వం మీద జరుగుతున్న దుష్ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్‌ ను కాని, ప్రభుత్వాన్ని కాని దూషిస్తూ ఎలాంటి పోస్టులు అప్‌లోడ్‌ చేసినా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగం సిద్దం చేశారని స‌మాచారం.

తాజాగా వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో ప్రతిపక్షాలు, కొంత మంది సోషల్‌ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు అప్‌ లోడ్ చేస్తుండ‌టాన్ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు సీరియ‌స్‌ గా తీసుకున్నాయి. ఈ ఉత్సాహం కాస్త శృతిమించి పోతుండ‌టంతో తాజా నిర్ణ‌యం తీసుకున్నారు. అస‌భ్య పోస్టుల గురించి సైబ‌ర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశామ‌ని, ఇక నుంచి ఇలాంటి పోస్టులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగుతుందని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి పోస్టులు ఆరోగ్యకరం కాదని ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకోవాలని, అంతే కాని ఇలా ఒకరిని కించపరిచే విధంగా పోస్టింగులు అప్‌ లోడ్ ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ హెచ్చ‌రిక‌తో ఎలాంటి మార్పు వ‌స్తుందో చూద్దాం మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/




Tags:    

Similar News