ప్రజాస్వామ్యానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచే పార్లమెంటు లాంటి అత్యున్నత ప్రదేశంలో ఒక మహిళపై అత్యాచారం జరగటం ఇప్పుడు సంచలనంగా మారింది. మహిళలపై అత్యాచారాలు కొత్తేం కాకున్నా.. పార్లమెంటు భవనంలో చోటు చేసుకోవటంపై ఇప్పుడా దేశంలో పెద్ద చర్చే జరుగుతోంది. అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ లోని పార్లమెంటు భవనంలో ఒక మహిళపై అత్యాచారం జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే.. ఈ అత్యాచారం ఎవరిపైన అన్నది మాత్రం బయటకు రాలేదు.
ఒక ఎంపీ వద్ద పని చేసే సహాయకుడు.. 23 ఏళ్ల వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఈ దారుణ ఘటన ఈ నెల 14న చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. సెక్సువల్ అఫెన్సెస్ డిటెక్టివ్ లు ఈ కేసును విచారిస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న అధికారులు.. కోర్టులో హాజరు పరిచారు. పార్లమెంటు భవనంలో అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి బెయిల్ లభించింది. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. తాము విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని.. అయితే.. ఈ ఘటనకు సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడించేందుకు తాము సిద్ధంగా లేమంటూ కన్జర్వేటివ్ పార్టీ స్పష్టం చేస్తోంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. అత్యాచారం చేసింది ఎంపీ కాదని.. ఎంపీ సహాయకుడు మాత్రమేనని కన్జర్వేటివ్ పార్టీ స్పష్టం చేసింది. చట్టాలు రూపొందించే చట్టసభల్లోనే మహిళలకు భద్రత లేకుంటే.. ఇంకెక్కడ దొరుకుతుంది? అన్న ప్రశ్న ఈ ఘటనను చూస్తే తెలుస్తుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/