కెనడా దేశంలో ఓ పరువు నష్టం కేసులో అత్యధిక మొత్తం అందుకున్న ఇండో-కెనెడియన్ గా అల్తాఫ్ నజరేలి నిలిచారు. ఈయన ఏకంగా 7 ఏళ్లపాటు కోర్టులో పోరాడి ఏకంగా 1.2 మిలియన్ డాలర్లు అంటే 8.4 కోట్లు గెలుచుకున్నారు. ఇది కెనెడాలోనే ఓ రికార్డు అట..
ఇండో కెనెడియన్ వ్యాపారవేత్త అల్తాఫ్ నజరేలి గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ కు చెందిన వాడు. కెనెడాలోని వాంకోవర్ లో స్థిరపడ్డాడు. వ్యాపారరంగంలో రాణిస్తున్నాడు. ఇతడిపై 2011లో అమెరికన్ బ్లాక్ చైన్ ఇన్వెస్టర్ ఓవర్ స్టాక్. కామ్ అనే వెబ్ సైట్ అసత్య కథనాలు ప్రచురించింది. నజరేలిని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారుడిగా.. ఆయుధాలు సరఫరా చేసే డీలర్ గా.. గ్యాంగ్ స్టర్ గా.. ఆల్ ఖైదాకు సాయం చేసేవాడిగా కథనాల్లో విమర్శించింది. ఈ కథనాలపై కోర్టుకెళ్లారు నజరేలి. తన ఖ్యాతీని దెబ్బతీసేలా ప్రచురించారని వెబ్ సైట్ సీఈవో పాట్రిక్ బైర్న్ పై పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసులో తాజాగా చివరి వాదనలు విన్న కెనెడా అత్యున్నత న్యాయస్థానం ప్యాట్రిక్ బైర్న్ వాదనలు తోసిపుచ్చింది. నజరేలికి 1.2 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కెనెడాలో ఇలా నష్టపరిహారం ఇంత పెద్ద మొత్తంలో అందుకున్నది నజరేలి కావడం విశేషం. ఆయన 7 ఏళ్లపాటు అలుపెరగకుండా న్యాయ పోరాటం చేసి గెలిచారు.