68 రూపాయలకే ఐఫోన్ 5ఎస్

Update: 2016-02-19 11:17 GMT
రింగింగ్ బెల్స్ మోగించిన ఫ్రీడమ్ 251 సంచలనాలు తెలిసిందే... అది నిజమో, కాదో తెలియని అయోమయాలు ఇంకా గాడ్జెట్ లవర్స్ ని వీడకముందే ఆన్ లైన్ మొబైల్ మార్కెట్ లో మరో సంచలన విషయం వెలుగుచూసింది. ఐఫోన్ 5ఎస్ ఫోన్ ను 68 రూపాయలకే కొనుక్కున్నాడో కుర్రాడు. ఐఫోన్ కాదు కదా చైనా ఫోన్ ఛార్జర్ కూడా ఆ ధరకు రాదు... అలాంటిది 68 రూపాయలకు ఐఫోన్ కొనడం ఆశ్చర్యమే. ఎక్కడ దొరుకుతుందో చెబితే మేం కూడా కొనుక్కుంటాం అని రెడీ అయిపోవద్దు... ఆ ఆఫర్ ఆ కుర్రాడికి మాత్రమే దొరికింది... అది కూడా ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ చేసిన పొరపాటు కారణంగా అలా జరిగిపోయింది.

ఇది విని మీరు ఇప్పుడు మీరు స్నాప్‌ డీల్‌ లో ఐఫోన్ 5ఎస్ కొనాలని ట్రై చేస్తే అక్కడ రూ.28,999 ధర కనిపిస్తుంది. కానీ, పంజాబ్ కు చెందిన బీటెక్ కుర్రాడు నిఖిల్ బన్సాల్ మాత్రం లక్కీగా దాన్ని 68 రూపాయలకు సొంతం చేసుకున్నాడు. క్యాష్ బ్యాక్లు - కార్డు ఆఫర్లు వంటివేమీ లేకుండానే డైరెక్టుగా  99.7 శాతం తగ్గింపు ధరకు కొనుక్కున్నాడు. కాకుంటే తాను చేసిన ఆర్డర్ పొందడానికి ఆయన గట్టిగానే పోరాడాల్సి వచ్చింది.

నిఖిల్ బన్సాల్ ఫిబ్రవరి 12న స్నాప్ డీల్ ఓపెన్ చేశాడు... అక్కడ ఆయనకు అదిరిపోయే ఆఫర్ కనిపించింది. ఐఫోన్ 5ఎస్ గోల్డ్ వేరియంట్ ఫోన్‌ 99.7% ధర తగ్గింపుతో కనిపించింది. వెంటనే ఆర్డర్ చేశాడు. కానీ, ఫోన్ మాత్రం ఎప్పటికీ డెలివరీ కావడం లేదు. ఆర్డర్ ట్రాక్ చేస్తే షిప్పింగ్ కూడా కాలేదు. అది స్నాప్ డీల్ సైట్ నిర్వహణలో జరిగిన పొరపాటు కారణంగా వచ్చిన ధర... కానీ, బన్సాల్ మాత్రం తాను బుక్ చేసిన ఫోన్ రాకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. తాను ఆర్డర్ చేసిన డీల్‌ ను స్నాప్‌ డీల్ విస్మరించిందంటూ, నిఖిల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీని పై విచారణ జరిపిని కోర్టు నిఖిల్‌‍ కు రూ.68కే ఐఫోన్ 5ఎస్‌ ను విక్రయించాలని స్నాప్‌ డీల్‌ కు సూచించింది. అంతేకాకుంగా ఆలస్యం చేసినందుకు పెనాల్టీ క్రింద రూ.2000 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News