ముస్లిం తెచ్చాడని ఆర్డర్ క్యాన్సిల్.. జోమాటో రిప్లై అదుర్స్

Update: 2019-08-01 07:48 GMT
ఫుడ్ ఆర్డర్ ను ముస్లిం తీసుకువచ్చాడని ఆర్డర్ ను క్యాన్సిల్ చేశాడో ప్రబుద్ధుడు. అంతటితో ఆగకుండా పెద్ద ఘనకార్యం చేసినట్టు ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ఈ ట్వీట్ చూసి షాకైన నెటిజన్లు తిండికి, ముస్లిం తేవడానికి ఏంటి లింకు అంటూ తిట్ల దండకం మొదలు పెట్టారు. ఇక ఈ వ్యవహారం వైరల్ గా మారడంతో తాజాగా జొమాటో కూడా స్పందించింది. ఆర్డర్ క్యాన్సల్ చేసిన వినియోగదారుడికి గట్టి బుద్దిచెప్పేలా సమాధానం ఇచ్చింది. జోమాటో రిప్లై ఇప్పుడు నెటిజనుల మనసు దోచేసింది.

అమిత్ శుక్లా అనే వ్యక్తి తాజాగా జోమాటో యాప్ ద్వారా ఫుడ్ ను ఆర్డర్ చేశాడు. అయితే ‘పియాజ్’ అనే ముస్లిం డెలివరీ బాయ్ ఈ ఆర్డర్ తెస్తున్నాడని జోమాటో మెసేజ్ పంపింది. దీంతో అమిత్ వెంటనే ఆ ఆర్డర్ ను క్యాన్సల్ చేశాడు. జోమాటో ఈ క్యాన్సల్ కు గల కారణం అడగగా.. ‘పవిత్ర శ్రావణ మాసంలో ముస్లిం వ్యక్తి నుంచి డెలివరీ అందుకోవడం నాకు ఇష్టం లేదు’ అని సమాధానం ఇచ్చాడు. క్యాన్సల్ ఫీజు పడినా చెల్లిస్తానని స్పష్టం చేశాడు.

ఈ సందర్భంగా జోమాటో యాప్ ను డిలీట్ చేసి తనపై ఒత్తిడి తెచ్చిన జోమాటో వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకుంటానని అమిత్ స్పష్టం చేశారు.

ఆ తరువాత ఈ వ్యవహారంపై అమిత్ ట్వీట్ చేశాడు. ఇది వైరల్ అయ్యింది. అమిత్ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు.  దీనిపై స్పందించిన జోమాటో.. ‘ఆహారానికి మతం లేదని.. ధర్మం ఇదే చెబుతోందని’ ట్వీట్ చేసింది. జోమాటో ట్వీట్ చాలా మంది మనసులు గెలిచింది. మంచి రిప్లై ఇచ్చిన జోమాటోపై ప్రశంసల వర్షం కురిసింది,


Tags:    

Similar News