కన్న కూతురుని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కర్కశంగా వ్యవహరించాడు. సైకోలా మారి తన కూతురి చెవులు కోసేశాడు. ఉన్మాదంతో ఆ చిన్నారి గొంతు నరకబోయాడు. సమయానికి పోలీసులు రాబట్టి ఆ పాప బ్రతికి పోయింది. లేకపోతే ఆ కసాయి తండ్రి తన కూతుర్ని బలి తీసుకునేవాడు. దెయ్యం చెప్పడం వల్లే తాను ఇలా చేశానని పోలీసులకు చెప్పడం గమనార్హం. హాలీవుడ్ హర్రర్ మూవీని తలపించే ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీలో బహదూర్ అనే వ్యక్తి క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అతడికి ఆరుగురు సంతానం. కొద్దినెలల కిత్రం అతడి మొదటి కుమార్తె చనిపోయింది. దీంతో, బహదూర్ మానసికంగా దెబ్బతిన్నాడు. కూతురు చనిపోయినప్పటి నుంచి అతడికి ఓ దెయ్యం కనిపించేదట. తన రెండో కూతుర్ని కూడా ఎత్తుకుపోతానని ఆ దెయ్యం బెదిరిస్తోందట.
దీంతో, మద్యం సేవించిన బహదూర్ నిద్రిస్తున్న తన చిన్న కుమార్తె చెవి కోసేశాడు. కూతురి ఏడుపు విని అతడి భార్య లేచి చూసేసరికి చిన్నారి రక్తపుమడుగులో పడి ఉంది. పాపని ఆస్పత్రికి తీసుకెళ్తున్న భార్యని అతడు అడ్డుకున్నాడు. మిగతా పిల్లల్ని గదిలో పెట్టి తాళం వేశాడు. అంతటితో ఆగకుండా తన కుమార్తె రెండో చెవిని కూడా కోసేశాడు.
ఇంకా దెయ్యం సంతృప్తి చెందలేదంటూ కూతురి గొంతు కోయబోయాడు. సమయానికి పోలీసులు వచ్చి బహదూర్ ను అడ్డుకున్నారు. దీంతో, పాప ప్రాణాలు దక్కాయి. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బహదూర్ చెప్పిన సమాధానాలకు పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. ప్రస్తుతం చిన్నారి దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు బహదూర్‌కి వైద్య పరీక్షలు చేయించి అరెస్ట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/