ఎవరి బర్త్ డే జరుపుకోవాలన్నా గరిష్టంగా 10 లోపు క్యాండిల్స్ అయితే సింగిల్ సింగిల్ గా వెలిగించి బర్త్ డేలు జరుపుకుంటారు. ఆ డబుల్ డిజిట్ లోకి ఎంటరైతే అక్కడి నుంచి డైరెక్ట్ నెంబర్ ఉన్న క్యాండిల్స్ ఆ కేకు మద్యలో పాతేస్తారు. మరి మూడంకెల సంఖ్య ఉన్న క్యాండిల్స్ వెలిగించాలంటే... ఆ వయసున్నవారు బ్రతికే అవకాశం తక్కువ, ఉన్నా బర్త్ డేలు జరుపుకునే సందర్భాలు ఉండకపోవచ్చు. కానీ ఇండోనేషియాలోని సపర్ మన్ సొడిమోజో కి ఇప్పటికీ బర్త్ డే కేక్ కట్ చేస్తున్నాడు.. ఇంతకూ ఇతని వయసెంతో చెప్పలేదు కదూ... అక్షరాలా 146 ఏళ్లు!
ప్రపంచంలోని అత్యంత పెద్ద వయసున్న వ్యక్తిగా వెలుగులోకి వచ్చాడు ఇండోనేషియాకు చెందిన సపర్ మన్ సొడిమేజో. ఇప్పటికీ నడవగలగడం, తన పనులు తాను చేసుకోవడం చేసే ఇతని జన్మదినాన్ని డిసెంబరు 31 - 1870 గా నిర్ధారించింది ఇండోనేషియా ప్రభుత్వం. బంధువులంతా ఇతన్ని ఆప్యాయంగా ఎంభా గోతో అని పిలుచుకుంటారు.
ఇంత వయసున్న సొడిమోజో లేటెస్ట్ బర్త్ డే ను ఇటీవల మనువలు, మునిమనువలు కలిపి 146వ పుట్టినరోజుని సెరగీన్ జిల్లాలో ఆహ్లాదంగా నిర్వహించారు. ఈ సీనియర్ మోస్ట్ సిటిజిన కి నలుగురు భార్యలు ఉండేవారు. అయితే ఆ భార్యలు, అతని కుమారులు, అతని తోబుట్టువులు అంతా ఎప్పుడో మరణించారు. అయితే ప్రస్తుతం మునివనలతో గోతో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉండటం విశేషం. కాగా, ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యంత పెద్ద వయస్కురాలిగా ఫ్రెంచ్ మహిళ జెన్నీ కాల్మెన్ట్ (122 ఏళ్ల) పేరిట ఉండేది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/