తమ్ముడికి కరోనా పాజిటివ్ .... అన్న ఆత్మహత్య : కారణం ఇదే !

Update: 2020-07-21 02:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి భారతదేశంలో కూడా విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ కరోనా మహమ్మారి మనుషులలో ఉండే మానవత్వాన్ని కూడా చంపేస్తుంది. కరోనా భయంతో ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా అటు వైపు తొంగి చూడటం లేదు. కరోనా లక్షణాలతో కొందరు, కరోనా భయంతో మరికొందరు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. తాజాగా తన తమ్ముడికి కరోనా సోకిందన్న బాధతో భయంతో ఓ అన్న ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కర్ణాటక రాష్ట్రం కోలారు నగరంలోని గాంధీనగర్‌ కాలనీలో నాగరాజ్‌ అనే 37 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తాపీ మేస్త్రిగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ సమయంలోనే శనివారం మధ్యాహ్నం అతని తమ్మునికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో ఆరోగ్య శాఖ అధికారులు అతన్ని కరోనా‌ ఆస్పత్రికి తరలించారు. దీనితో తన తమ్ముడికి సోకిన కరోనా తనకు కూడా సోకి ఉంటుందేమోననే అన్న నాగరాజ్‌ భయపడ్డాడు. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ ‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తమ్ముడు కరోనాతో ఆస్పత్రి పాలవ్వడం.. ఇటు అన్న భయంతో ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే, ముందు జాగ్రత్తగా మృతుడికి కరోనా టెస్ట్ చేసారు. ఇంకా రిపోర్ట్ రావాల్సింది ఉంది.
Tags:    

Similar News