విడుదలకు ముందే...పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న పద్మావతి సినిమా మరో కలకలం రేపే వార్తతో తెరమీదకు వచ్చింది. ఈ సినిమా కోసం 40 ఏళ్ల వ్యక్తి జైపూర్ లోని నహర్ గఢ్ కోటకు ఉరి వేసుకొని చనిపోవడం సంచలనంగా మారింది. `మే ఎవరి తలలు నరకడం లేదు. ప్రాణ త్యాగం చేస్తాం`అని ఆ వ్యక్తి రాయిపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం దీపిక, సంజయ్ భన్సాలీల తలలు నరికివేస్తామని రాజ్‌పుత్ కర్ణిసేన ప్రకటించగా, తాజాగా జరిగిన ఘటనకి మాకు ఎలాంటి సంబంధం లేదని కర్ణిసేన అంటుంది. మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఏ వర్గానికి చెందిన వాడు, ఇది హత్య, ఆత్మహత్యనా అనే దానిపై పోలీసులు ఆరాలు తీస్తున్నట్టు తెలుస్తుంది. కాగా, ఈ యువకుడు ఆత్మహత్యతో పోలీసులు అటు దీపికకి ఇటు సంజయ్ లీలా భన్సాలీకి సెక్యూరిటీని పెంచినట్టు సమాచారం.
వివాదాల నడుమే పద్మావతి చిత్ర షూటింగ్ పూర్తి చేసుకోగా, ఈ సినిమా రిలీజ్‌పై ఇప్పటికి సందేహాలు నెలకొన్నాయి. పలు రాష్ట్రాలలో ఇప్పటికే పద్మావతి సినిమా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 1న విడుదల కావలసిన ఈ చిత్రం ఇప్పటికి సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోపోగా వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణకి వెళ్లనుంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి చిత్రంలో దీపిక పదుకొణే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
కాగా, పద్మావతి సినిమాపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణ సంస్థ వయాకాం 18 రూ.140 కోట్లకు బీమా చేసినట్లు తెలుస్తోంది. సినీ థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు వీక్షించే అవకాశం లేకుంటే డిస్ట్రిబ్యూటర్లు రూ.80 కోట్లకు క్లెయిమ్ చేసే హక్కు కలిగి ఉంటారు. విడుదలైన తర్వాత సినిమా థియేటర్లపై దాడి చేసినా బీమా క్లెయిమ్ చేయొచ్చు. అయితే సినిమాను ప్రభుత్వం నిషేధిస్తే బీమా వర్తించదు.