సాఫ్టువేర్ కోడింగ్ లో పొరపాట్లు అందరూ చేస్తారు. అయితే, దాన్ని సరిదిద్దుకోవడానికి ఉన్న ఆప్షన్లతో మళ్లీ బయటపడతారు. కానీ, లండన్ లో చిన్నపాటి సంస్థ ను నడుపుతున్న మార్కో మార్సలా అనే వ్యక్తి మాత్రం సరిదిద్దుకోవడానికి వీల్లేని కమాండ్ తో తన కంపెనీ డాటాను మొత్తం తానే చేజేతులా పోగొట్టుకున్నాడు. అవును ... ఒక్క రాంగ్ కోడ్ తో తన కంపెనీ సమాచారం, కస్టమర్ల సమాచారం మొత్తం గాల్లో కలిపేశాడు. సర్వర్ ను సంప్రదించినా రికవరీ చేూయడానికి వీల్లేకుండా చేసుకున్నాడు. ఇండియన్ టెక్కీలు ఇప్పుడాయన్ను చూసి వీడెవడో పరమానందయ్యకు పెద్ద శిష్యుడిలా ఉన్నాడని సెటైర్లు వేస్తున్నారు.
లండన్ లో వెబ్ హోస్టింగ్ సంస్థను నడుపుతున్న మార్కో మార్సాలా అనే వ్యక్తి సర్వర్ కంప్యూటర్ లో పొరపాటున ’rm - rf’ అనే తప్పుడు కోడ్ రాశాడు. సాధారణంగా డిలీట్ చేస్తున్నపుడు వార్నింగ్ నోటిఫికేషన్ వస్తుంది. కోడ్ లో ఆ వేరియబుల్ ను నిర్వచించకపోవడం వల్ల ఎలాంటి నోటిఫికేషన్ రాకుండానే, బ్యాకప్ తో సహా అన్ని ఫైళ్లు డెలీట్ అయిపోయాయి.
ప్రోగ్రామ్ కోడింగ్ లో రాసిన తప్పు అతని సొంత కంపెనీయే నాశనమయ్యేలా చేసింది. ఆ తప్పుడు కోడ్ వల్ల అతని కంప్యూటర్లలోని డేటాతోపాటు, దాదాపు 1535 మంది కస్లమర్ల వెబ్ సైట్ ల్లోని సమాచారం కూడా డిలీట్ అయింది. సర్వర్ లో కోడింగ్ సమయంలో విలువైన డేటా విడిగా ఉండేలా వేరియబుల్ ను నిర్వచించకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు తరువాత తేల్చారు.