ఇళ్ల‌ల్లోనే చేప‌లు ప‌డుతున్న అమెరిక‌న్లు

Update: 2017-08-28 08:13 GMT
భూత‌ల స్వ‌ర్గంగా పేర్కొనే అమెరికాలో ప‌రిస్థితితులు ఇప్పుడు దారుణంగా మారాయి. ప్ర‌కృతి క‌న్నెర్ర చేయ‌టంతో అమెరికాలోని టెక్సాస్ వాసులు అత‌లాకుత‌లం అవుతున్నారు. హార్వే హ‌రికేన్ ఎఫెక్ట్ తో దాదాపు 60 ల‌క్ష‌ల మంది అమెరికన్లు ప‌డుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఈ ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఇప్ప‌టికే ప‌లువురు మృత్యువాత ప‌డ‌గా..  ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షంతో ఇళ్ల‌ల్లోకి వ‌ర్ష‌పు నీరు వ‌చ్చేస్తున్నాయి.

వ‌ర్ష‌పు నీటితో పాటు.. పెద్ద పెద్ద చేప‌లు కూడా వ‌చ్చేస్తున్న ప‌రిస్థితి. దీంతో.. ఇళ్ల‌ల్లో ఉంటూ.. చేప‌లు ప‌డుతున్న వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. వ‌ర‌ద నీటితో కొట్టుకు వ‌చ్చిన ఒక చేప‌ను త‌న ఇంట్లో ప‌ట్టుకునేందుకు స‌ల్ద‌నా అనే వ్య‌క్తి చేసిన ప్ర‌య‌త్నాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. త‌న తండ్రి చేపను ప‌ట్టుకోవ‌టానికి చేసిన ప్ర‌య‌త్నాన్ని అత‌ని కుమార్తె వీడియో తీసి పోస్ట్ చేసింది.

టెక్సాస్ వాసుల ఇళ్ల‌ల్లో ఎలాంటి ప‌రిస్థితి నెల‌కొంద‌న్న విష‌యాన్ని తాజా వీడియో చెబుతుంద‌ని చెప్పొచ్చు. ఈ వీడియో ఇప్పుడు విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. హార్వే హ‌రికేన్ కార‌ణంగా గంట‌కు 130 మైళ్ల వేగంతో బ‌ల‌మైన గాలులు వీయ‌నున్న‌ట్లు అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ గాలుల ధాటికి చెట్లు.. విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. ఇక‌.. వాహ‌నాలు కొట్టుకుపోతున్నాయి. ఇంటి పైక‌ప్పులు వీడిపోతున్నాయి.

హార్వీ హ‌రికేన్ కార‌ణంగా హుస్ట‌న్‌.. హారిస్ కౌంటీల‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 20 అంగుళాల మేర వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని.. కొన్ని ప్రాంతాల్లో అయితే 40 అంగుళాల మేర కూడా వ‌ర్ష‌పాతం న‌మోదు అయ్యింద‌ని చెబుతున్నారు. రానున్న కొద్ది రోజులు వ‌ర్షాలు భారీగా ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని.. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. హార్వే టెక్సాస్ వాసుల‌కు చుక్క‌లు చూపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Full View
Tags:    

Similar News