సైకిల్ పై మృతదేహం..లాక్ డౌన్ లో దారుణం

Update: 2020-04-19 10:54 GMT
లాక్ డౌన్ వేళ మానవత్వం మంటగలిసింది. ఓ వ్యక్తి చనిపోతే ఎవరూ ముందుకు రాకపోవడంతో మూటగట్టి సైకిల్ పై తరలించిన దైన్యం తెలంగాణలోని కామారెడ్డి నగరంలో వెలుగుచూసింది. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన అందరినీ కలిచివేసింది.

కరోనాతో లాక్ డౌన్ కారణంగా అత్యవసర సేవలు మినహా సర్వం బంద్ చేశారు. కరోనా కేసులు - చికిత్సలు - శాంతిభద్రతలపైనే అధికారులు దృష్టిసారించారు. అయితే కామారెడ్డిలో కూడా ఈ దిగ్బంధనాలు చోటుచేసుకున్నాయి.

తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ లో ఓ 40 ఏళ్ల రాజు అనే వ్యక్తి మృతిచెందాడు. అతడికి హెచ్.ఐవీ ఉంది. ఆ కారణంగానే ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్స్ లు - పాడేమోసేవారు కరువయ్యారు. దీంతో అతడి బంధువు రాజు మృతదేహాన్ని మూటగట్టి సైకిల్ పై ఆస్పత్రికి తరలించాడు. ఏ వాహనం అడిగినా లాక్ డౌన్ తో ముందుకు రాకపోవడంతో ఇలా సైకిల్ పై ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దుప్పటి నుంచి శవం కాల్లు వేల్లాడుతూ ఉన్న దృశ్యం కలిచివేసేలా కనిపించింది.

రోగి చనిపోతే కూడా అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో ఆస్పత్రిలో వదిలివేయడానికి తీసుకెళ్లారు. లాక్ డౌన్ వేళ ఇంతటి దైన్యం వెలుగుచూసింది.
Tags:    

Similar News