తన భార్యతో చనువుగా ఉంటున్న ఉద్యోగిని భయపెట్టడానికి ఓ భర్త విచిత్రమైన ప్లానేశాడు. భార్యతో స్నేహంగా ఉంటున్న వ్యక్తికి కొరియర్ లో రెండు విషపు పాములు పంపించి బెదరగొట్టాడు. ఇకనైనా మారకపోతే ఈసారి చావు తప్పదని దాంతోపాటు రాసిన లేఖలో హెచ్చరించాడు. అంతేకాదు... కాస్త దూరంగా ఉండి ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మంచిది అంటూ దానిపై లేఖ కూడా రాసి పెట్టాడు.
బెంగళూరు రేస్ కోర్స్ రోడ్డులో బెంగళూరు ఎలక్ట్రిసిటి సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కాం)లో ఉద్యోగం చేస్తున్నాడు ఒక వ్యక్తి. అక్కడే ఉద్యోగం చేస్తున్న మహిళతో ఆయన చనువుగా ఉంటున్నారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త మనసు గాయపడింది. భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆ వ్యక్తి కి బుద్ధి చెప్పాలని ప్లాన్ వేశాడు. అందు కోసం అతను రెండు విషపూరిత పాములు తీసుకుని పార్శిల్ బాక్స్ లో వేశాడు. పాములు గాలి పీల్చుకునేందుకు వీలుగా దానికి రంధ్రాలు పెట్టాడు. తరువాత కొరియర్ లో ఆ పాములను ఆయనకు పంపించాడు. ఆ బాక్స్ మీద ఓ లేఖ, బాక్స్ లోపల ఓ లేఖ పెట్టాడు. బయట ఉన్న లేఖలో నీవు దూరం నుంచి ఈ బాక్స్ తియ్యాలని, అది నీ మంచికే అని రాసి ఉంది.
ఆ వ్యక్తి బాక్స్ తీసి చూసే సరికి అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయినంత పని అయ్యింది. బాక్స్ లోపల రెండు పెద్ద పాములు ఉన్నాయి. పాములు బుసలు కొట్టడంతో కార్యాలయం సిబ్బంది హడలిపోయారు. బాక్స్ లో ఉన్న ఉత్తరం తీసి చూడగా నీవు జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది, నా భార్య గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు, ఆలోచించ వద్దు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని రాసి ఉంది. ఎప్పటికైనా ప్రాణహాని ఉందని అనుకున్న ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.