మోసం చేయాలనే ఆలోచన ఉండాలే కానీ.. దరిద్రపుగొట్టు ఐడియాలు రావటం మామూలే. తాజాగా అాలంటిదే ఈ ఉదంతంగా చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పీఏ పేరుతో ఒక మోసగాడు పలువురికి ఫోన్లు చేసి.. మోసం చేస్తున్న వైనం తాజాగా బయటకు వచ్చింది. కేటీఆర్ పీఏగా తనను తాను పరిచయం చేసుకోవటం.. వారి నుంచి బహుమానాలు.. నగదు.. గిఫ్టులు తీసుకుంటూ మస్కా కొడుతుంటాడు.
కేటీఆర్ పీఏను మాట్లాడుతున్నా.. సాయంత్రం వస్తాను.. షాపింగ్ చేయాలన్న ఆదేశాలతో పాటు.. ఫలానా చోటుకు వస్తాం.. అక్కడ ఏర్పాట్లు చేయాలంటూ హుకుం జారీ చేస్తుంటాడు. ఇదే తీరులో మూడు రోజుల క్రితం బంజారాహిల్స్ లోని ఒక నేతకు సదరు నిందితుడు ఫోన్ చేసి.. తాను కేటీఆర్ పీఏనని.. తనకో పని చేసి పెట్టాలని కోరారు.
అతడి మాటలు.. తీరు కాస్త తేడాగా ఉండటంతో అనుమానం వచ్చిన సదరు నేత.. ఇతగాడి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. చెక్ చేసిన పోలీసులు అతడు కేటీఆర్ పీఏనే కాదని తేల్చారు. దీంతో తనను మోసం చేస్తున్న వ్యక్తిపై సదరు నేత ఫిర్యాదు చేశారు. కేటీఆర్ పీఏనంటూ మస్కా కొడుతున్న కేటుగాడి కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు.