కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచరుల్లో ఇప్పుడు కొత్త భయం మొదలైంది. తమ నాయకుడు - ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఓ మంత్రిగాడు శపించాడని.. అందువల్లే ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయని వారంటున్నారు. సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఇటీవల జరుగుతున్న పరిణామాలకు మంత్రగాడి శాపమే కారణమని అనుచరులంతా ఆందోళన చెందుతున్నారట. సిద్ధూ మాత్రం అదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు.
కర్ణాటకలోని కొల్లెగల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొద్ది కాలం క్రితం సిద్ధరామయ్యను కలిశాడట.. తాను మంత్రించి తెచ్చిన వస్రాన్ని తీసుకోవాలని కోరాడట. తనకు అలాంటి నమ్మకాలు లేవని సిద్ధరామయ్య సున్నితంగా తిరస్కరించారట. దీంతో ఆ మాంత్రికుడు తన కుటుంబం కష్టాల్లో ఉందని - భార్యకు అనారోగ్యమని - ఆదుకోవాలని కోరాడట. అందుకు సీఎం ఆగ్రహించి ఇలా అబద్ధాలు చెప్పి బతికేవారు ఎక్కువైపోయారంటూ మండిపడ్డారట. దీంతో ఆ మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్లిపోతూ వెనక్కు తిరిగి సీఎంను శపించినట్టు అనుచరులు చెబుతున్నారు.
కొల్లెగల ప్రాంతం కర్ణాటకలో మాంత్రికులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం కావడంతో అనుచరులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులంతా కొల్లెగలకు లైను కడతారు. అక్కడికి వెళ్లి మాంత్రికులతో పూజలు చేయించుకుంటారు. కొల్లెగల మాంత్రికులతో తమపై క్షుద్రపూజలు ప్రయోగిస్తున్నారని జేడీ (ఎస్)పై కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణలు గుప్పించిన సందర్భాలున్నాయి. అలాంటి కొల్లెగల ప్రాంతానికి చెందిన మాంత్రికుడి శాపం వల్లే సిద్ధరామయ్యను కష్టాలు చుట్టుముడుతున్నాయని అనుచరులు అంటున్నారు.