జేబులో నోటే నెత్తిన మూటయింది!

Update: 2016-11-19 10:47 GMT
 అత్యవసరంగా 20 వేలు కావాలని కోరిన వ్యక్తికి బ్యాంకు నుంచి అనుకోని భారం పడింది. ఆయన నెత్తిన 15 కేజీల మూట మోయాల్సి వచ్చింది. అవును... పెద్ద నోట్ల రద్దుతో డబ్బుకు నానా బాధలు పడుతున్న ఢిల్లీకి చెందిన ఇంతియాజ్ ఆలం అనే వ్యక్తి అత్యవసర పని కోసం 20 వేలు మార్చుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. నిబంధనలు ప్రకారం అంత మొత్తం మార్చడానికి వీల్లేదు. అయితే.. సరైన కారణం చెప్పి ప్రాథేయపడడంతో బ్యాంకువారు ఆయన మొర ఆలకించారు. కానీ... రూ.10 కాయిన్ల మూటను ఆయనకు అంటగట్టారు. దీంతో ఏదో ఒకటి దొరికిందిలే అనుకుని ఆయన దాన్నే తెచ్చుకున్నారు.

ర‌ద్దయిన నోట్ల కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా న‌గ‌దు కొర‌త ఏర్పడిన సంగ‌తి తెలిసిందే. చాలా చోట్ల వంద‌నోట్లే కాకుండా కొత్త రూ.2000 నోట్లు కూడా కొన్ని బ్యాంకులు - ఏటీఎంల‌లో ల‌భ్యం కాని ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీలో ప్రజాసంబంధాల అధికారిగా పనిచేస్తున్న ఇంతియాజ్‌ ఆలమ్ అక్కడి జామియా సహకార బ్యాంకుకు వెళ్లి త‌న‌కు అర్జెంటుగా రూ.20వేలు కావాల్సి ఉందని బ్యాంకు సిబ్బందిని కోరగా ఈ అనుభవం ఎదురైంది.

20 వేల రూపాయలకు సరిపడా ఆ నాణేలు మొత్తం పదిహేను కీజీల బరువు ఉన్నాయట. దాన్నిప్పుడు ఆయన జనం వద్ద ఉన్న 100 నోట్లకు మార్పిడి చేసుకుని భారం తగ్గించుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News