రూ.39కోట్ల బిల్లు ఇచ్చి మూర్చ తెప్పించారు

Update: 2015-11-23 08:54 GMT
తమ ప‌ని తీరుతో షాకులివ్వ‌టం విద్యుత్తు శాఖ‌కు కొత్తేం కాదు. సామాన్యుల‌కు ల‌క్ష‌లాది రూపాయిలు బిల్లులు ఇచ్చేసి వారు బిత్త‌ర‌పోయేలా చేసే ఘ‌ట‌న‌లు చాలానే చోటు చేసుకున్నాయి. మ‌రీ.. సింపుల్‌ గా ల‌క్ష‌ల్లో బిల్లులు ఇస్తే ఏం బాగుంటుంద‌ని అనుకున్నారో ఏమో కానీ.. జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన విద్యుత్తు అధికారులు ఏకంగా కోట్ల రూపాయిల్లో బిల్లు ఇచ్చేసి కొత్త రికార్డు సృష్టించారు.

జ‌మ్మూకు చెందిన పురాణ్ న‌గ‌ర్‌ లో నివ‌సించే రామ్ కృష్ణ‌న్ అనే వ్య‌క్తికి అక్టోబరు నెల‌కు సంబంధించిన క‌రెంటు బిల్లును చేతికి ఇచ్చారు. ఎప్ప‌టి మాదిరే.. ఏ రూ.200.. రూ.300 వ‌స్తుంద‌నుకుంటే ఏకంగా రూ.39కోట్ల మేర బిల్లు రావ‌టంతో ఆయ‌న నోటి వెంట మాట రాని ప‌రిస్థితి. బిల్లు చూసి షాక్ తిన్న ఆయ‌న‌.. ప‌రుగుప‌రుగున విద్యుత్తు అధికారుల దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లారు.

దీన్ని చూసిన అధికారులు.. ఏదో సాఫ్ట్ వేర్ స‌మ‌స్య వ‌చ్చి ఉంటుంద‌ని.. ఏం ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ‌తామ‌ని చెప్పారట‌. అధికారుల‌దేముంది..తాపీగానే చెబుతారు. కానీ.. కోట్లాది రూపాయిల బిల్లు వ‌చ్చిన పెద్ద‌మ‌నిషికేగా అస‌లు బాధంతా. త‌న బిల్లు ఇష్యూను వెంట‌నే తేల్చ‌మ‌ని స‌ద‌రు సామాన్యుడు వేడుకుంటున్నాడు. అయినా.. కోట్లాది రూపాయిలు బిల్లు వ‌చ్చేంత త‌ప్పు సాఫ్ట్ వేర్ లో ఎందుకు ఉన్న‌ట్లో..?
Tags:    

Similar News