హైదరాబాద్ నగరంలో ఓ కరోనా పాజిటివ్ కేసు సంచలనంగా మారింది. తాయెత్తు కట్టించుకోవడం వల్ల అతనికి కరోనా సోకిందని తెలుస్తుంది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. హైదరాబాద్ కి చెందిన ఓ యువకుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భూతాన్ని తరమడానికి తావీదును నమ్ముకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ఓ దర్గాకు వెళ్లి కరోనా రాకుండా తాయెత్తు కట్టించుకున్నాడు. ఇక తనకు రాదనుకుని హాయిగా ఉన్నాడు.
అయితే , ఆ తర్వాత కొద్ది రోజులకు అనారోగ్యం పాలు కావడం తో హాస్పిటల్ కు వెళ్లి చెక్ చేసుకోగా అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనిపై దర్యాప్తు చేయగా, ఆ తాయెత్తు కట్టిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని క్వారంటైన్ లో పెట్టారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి ఆంటే నమ్మే జనాలు ఇంకా ఉన్నారు ఆంటే నిజంగా ఆశ్చర్యమేయకమానదు.
ఇకపోతే , ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ ..ఇంకా రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. కొన్ని లక్షల మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల 85 వేల మందికి పైగా కరోనా భారిన పడ్డారు. అలాగే 70,344 మంది మృతి చెందారు. ఇక మన దేశంలో కూడా కరోనా వైరస్ మహ్మమారి రోజురోజుకి మరింత తీవ్రరూపం దాల్చుతుంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 4,314కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.