ఆ పని చేసినందుకు 235 ఏళ్ల జైలు శిక్ష!

Update: 2016-09-14 05:45 GMT
యావజ్జీవ కారాగార శిక్ష - అదీ కాకపొతే ఉరి శిక్ష విధించడం వరకూ మనకు తెలుకు కానీ.. తాజాగా ఒక వ్యక్తికి 235 ఏళ్ల జిలు శిక్ష పడింది. అదేంటి మరీ అంత పెద్ద శిక్ష వేసింది కోర్టు.. ఎంత పెద్ద నేరం చేశాడో అనుకుంటున్నారా? అవును అతడు చేసింది అతి పెద్ద నేరమే కాదు అతి జుగుప్సాకరమైన పని కూడా. విషయం తెలిసి జనాలు కూడా ఈ శిక్షపై హర్షం ప్రకటిస్తున్నారు.

వివరాళ్లోకి వెళితే... చైల్డ్ పోర్న్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తికి అమెరికాలో ఓ కోర్టు 235 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇద్దరు పిల్లలతో బలవంతంగా లైంగిక చర్యలకు సంబందించిన వీడియోలను రూపొందిస్తూ పట్టుబడిన అతడిని కోర్టు ఈ స్థాయిలో శిక్షించింది. ఇదే నేరానికి సంబందించి అతడికి సహకరించిన మరో మహిళకు కూడా 235 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమెరికాలోని లివర్ పూల్ లో ఉండే జాసన్ కాప్ (46) అనే వ్యక్తి కొంత కాలంగా చిన్న పిల్లలను ఎగుమతి చేయడమే కాకుండా వారి న్యూడ్ ఫొటోలు తీసి విక్రయించడంతో పాటు వారితో బలవంతంగా పోర్న్ వీడియోలు తీయడం చేస్తున్నాడు. ఈ పనికిమాలిన పనులకు అలెన్ బాండ్ అనే మహిళ కూడా ఇతడికి సహాయ పడింది.

తమ ప్రాంతంలో చైల్డ్ పోర్న్ చర్యలను నిలువరించే క్రమంలో భాగంగా చైల్డ్ ఎక్స్ ప్లాయిటేషన్ టాస్క్ ఫోర్స్ బృందం జాసన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే క్రమంలో ట్రాప్ వేసింది. అతనితో ముందుగా మెస్సేజ్ ల ద్వారా పరిచయం పెంచుకున్న అండర్ కవర్ పోలీసులు అనంతరం అతడి ద్వారానే పలు విషయాలు రాబట్టారు. అన్ని విషయాలు తెలుసుకున్న అనంతరం తాము అండర్ కవర్ పోలీసులమని చెప్పడంతో షాక్ తిన్న జాసన్ తప్పుఒప్పుకోక తప్పలేదు. ఫలితంగా ఈ నేరానికి కోర్టు ఇతనికి 235ఏళ్ల శిక్ష విధించింది.
Tags:    

Similar News