ఆవుల్ని తీసుకెళుతున్నార‌ని చంపేశారు

Update: 2017-04-05 09:44 GMT
ఒక త‌ప్పు జ‌ర‌గ‌కుండా చూడ‌టం కోసం మ‌రో త‌ప్పు చేయ‌కూడ‌దు. చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై చ‌ట్ట‌బ‌ద్ధంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అన్యాయం జ‌రుగుతుంద‌ని.. చ‌ట్టాన్ని తీసుకోవ‌టం ఎల్ల‌వేళ‌లా మంచిది కాదు. నేరాలు జ‌ర‌గ‌కుండా అడ్డుకోవ‌టానికి పోలీస్ వ్య‌వ‌స్థ ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గోవుల్ని సంర‌క్షిస్తామ‌ని చెప్పే గోసంర‌క్ష‌కులు.. మ‌నిషి ప్రాణాల్ని తీసేందుకు సైతం వెనుకాడ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

రాజ‌స్థాన్లోని అల్వార్ జిల్లా ప‌రిధిలో 50 ఏళ్ల‌ పెహ్లుఖాన్ మ‌రికొంద‌రు క‌లిసి ఆరు వాహ‌నాల్లో గోవుల్ని త‌ర‌లిస్తున్నారు. అయితే.. త‌మ వ‌ద్ద గోవుల్ని త‌ర‌లించేందుకు అవ‌స‌ర‌మైన ప‌త్రాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గోవుల్ని త‌ర‌లించే ప్ర‌య‌త్నాల్ని అడ్డుకున్న కొంద‌రు.. పెహ్లు ఆయ‌న స‌హ‌చ‌రుల‌పై దాడులు జ‌రిపారు. ఈ దాడిలో ఒక‌రు మ‌ర‌ణించ‌గా.. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

గోసంర‌క్ష‌కులుగా చెప్పుకుంటున్న బృందంలోని స‌భ్యుల్ని హిందూ జాగ‌ర‌ణ్‌.. భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌లుగా చెబుతున్నారు. రాజ‌స్థాన్‌ లో చోటు చేసుకున్న ఈఘ‌ట‌న‌లో బాధితులుగా చెబుతున్న వారు హ‌ర్యానా రాష్ట్రానికి చెందిన నుహ్ జిల్లాకు చెందిన ముస్లింలుగా చెబుతున్నారు. గోసంర‌క్ష‌కుల దాడిలో గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేస్తున్నారు. గోవుల్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న వారిపై జ‌రిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఎంత గో సంర‌క్ష‌కులైతే మాత్రం ఇంత విచ‌క్ష‌ణార‌హితంగా దాడుల‌కు పాల్ప‌డ‌తారా? అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉదంతంలో సంబంధం ఉన్న దాదాపు 200 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచార‌ణ షురూ చేశారు. ప‌లువురిని అదుపులోకి తీసుకొని.. ఈ ఇష్యూకు సంబంధించిన వివ‌రాల్ని సేక‌రిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News