ప్రేమించాలని కోరాడు. కాదంటే స్నేహితులుగా ఉందామన్నాడు. అందుకు సరే అన్న తర్వాత.. చనువు పెరిగిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ కొత్తకథ షురూ చేశాడు. అందుకు కుదరదని చెప్పిన ఆమెను దారుణంగా చంపిన దారుణ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
అంతేకాదు.. గుట్టు చప్పుడు కాకుండా చంపేసి తనకేమీ తెలీదన్నట్లుగా వ్యవహరించిన అతడి భాగోతం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. వనపర్తి జిల్లా భిల్లాగణపురం మండలం మానాజీపేటలో చోటు చేసుకుంది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
మానాజీ పేటకు చెందిన శ్రీశైలం 2017లో హైదరాబాద్ లో డిగ్రీ చదివాడు. అప్పట్లో కాటేదాన్ కు చెందిన సాయిప్రియతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రేమిస్తున్నట్లుగా వెంటపడుతున్నా ఆమె నో చెప్పేది. దీంతో స్నేహంగా ఉందామనేవాడు. దాంతో నమ్మి అతడితో మాట్లాడేది. అయితే.. ఆమెను పెళ్లి చేసుకుంటానని మళ్లీ ఇబ్బందులు పెట్టటం మొదలు పెట్టాడు. అతడి తీరునచ్చక ఇంట్లో చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు అతడ్ని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఈ నెల 5న సాయిప్రియకు ఫోన్ చేసిన అతడు మాట్లాడాలని.. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరుకు రావాలన్నాడు. అతడి మాటల్ని నమ్మి వెళ్లిన సాయిప్రియ అతడి బైక్ ఎక్కింది. మానాజీపేట శివారులో ముబ్బుగుట్టలోకి తీసుకెళ్లి.. ఆమెను మరోసారి పెళ్లి చేసుకోవాలని అడిగాడు. అందుకు ఆమె నో చెప్పటంతో వారిద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. అది కాస్తా పెరిగి.. కోపంతో ఆమె మెడకు చున్నీ బిగించి హతమార్చాడు.
అనంతరం అతడి బంధువు శివ సాయం తీసుకొని డెడ్ బాడీని పూడ్చి పెట్టాడు.తమ కుమార్తె కనిపించకపోవటంతో కాటేదాన్ పోలీస్ స్టేషన్ లో యువతి తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు.
శ్రీశైలంమీద అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో అతడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. అతను తాను చేసిన దారుణాన్ని ఒప్పుకుంటూ అసలు విషయాన్ని చెప్పేశాడు. గురువారం డెడ్ బాడీని బయటకుతీసి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు విచారణలో మిగిలిన విషయాలు బయటకు వస్తాయని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.